అన్వేషించండి

AP Governor Speech Highlights: గత ఐదేళ్లలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే, స్వర్ణాంధ్ర@ 2047 మా విజన్- ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

AP Assembly Budget Session | గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిందని, కూటమి ప్రభుత్వం అంతా గాడిన పెట్టే పనిలో బిజీగా ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

AP Assembly Session | అమరావతి: ఏపీలో గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారని, అందుకే కూటమికి విజయం అందించారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరుగనుంది. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చుతున్నాం. మెగా డీఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు సంతకం చేశాం. రాష్ట్రంలో పాలన గాడిన పెడుతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

ముగ్గురిపై నమ్మకంతో భారీ మెజార్టీ

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు ఎన్డీయే కూటమికి ఘనం విజయాన్ని అందించారు. గత ప్రభుత్వంలో అన్నిరంగాల్లో జరిగిన దుర్వినియోగంతో విపత్కర పరిస్థితి తలెత్తింది. గత ఐదేళ్లలో (2019-24) జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది. రాష్ట్ర వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ, ఎక్సైజ్, ఇసుక తవ్వకాల్లో లోపభూయిష్ట విధానాలతో రాష్ట్ర ఆదాయానికి గండిపడింది, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోయాం, అధిక రుణ స్థాయి మరియు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడం, భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకం నిధుల మళ్లింపు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, రూ.1.35 లక్షల కోట్ల మేర అప్పులున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, సూపర్ సిక్స్ నేర్చడానికి కృషి చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000లకు పెంచడం, 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సిని ప్రకటించడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గుంతలు లేని రోడ్ల కోసం మిషన్, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు చేస్తున్నాం. 

 

గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చాం. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేసి స్థానిక పాలనను బలోపేతం చేశాం. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. 

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, బిపిసిఎల్, టిసిఎస్ వంటి పలు అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు  రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. 2024-25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఏపీ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం రూ.14.22 లక్షల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. ఇది 12.94% నామమాత్రపు వృద్ధి రేటు. గత ఏడాది తలసరి ఆదాయం రూ.2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86 శాతం, పరిశ్రమలు 6.71 శాతం, సేవల రంగం 11.70 శాతం  చొప్పున వృద్ధి చెందాయి. 

నాడు హైదరాబాద్ లో ఐటీ.. నేడు ఏపీలో ఏఐ విప్లవం

 రైతుల నుంచి విద్యార్థుల వరకు, మహిళల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. 1995లోనే స్వయం సహాయక బృందాలను రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కీలక భాగంగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యావత్ దేశానికి చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సుమారు రూ.35,000 కోట్ల బ్యాంకు లింకేజీ పంపిణీతో 30 శాతం జాతీయ వాటాతో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 99.66 శాతం రికవరీతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. ఐటీ విప్లవానికి చంద్రబాబు నాంది పలికారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్ పునాది వేసిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఐటీపై ఫోకస్ చేశారు. ఐటి నుండి కృత్రిమ మేధ (AI) వరకు పరిపాలన, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి కోసం కృత్రిమ మేధస్సును వినియోగిస్తోంది. 

నా ప్రభుత్వం పది సూత్రాలు - స్వర్ణాంధ్ర @2047 సుభిక్ష భవిష్యత్తు కోసం మన దార్శనికతను నిర్వచించేలా 10 మార్గదర్శక సూత్రాలను రూపొందించింది.  
i. పూర్తిగా పేదరికం నిర్మూలన.
ii. మానవ వనరుల అభివృద్ధి & జనాభా నియంత్రణ. 
iii. నైపుణ్యం పెంపుదల మరియు ఉపాధికల్పన
iv. నీటి భద్రత
v. రైతు-అగ్రిటెక్ 
vi. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్
vii. వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం
viii. ఉత్పత్తి పరిపూర్ణత 
ix. స్వచ్ఛాంధ్ర
x. విస్తృత సాంకేతికత ఏకీకరణ

Also Read: YSRCP Walk Out: గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్, జగన్ ఈ సెషన్స్‌లో మళ్లీ కనిపించరా? 

స్వర్ణాంధ్ర @ 2047

వికసిత్ భారత్ దార్శనికతతో 'పీపుల్ ఫస్ట్' విధానంతో స్వర్ణాంధ్ర @2047 సాధించడానికి రోడ్ మ్యాప్­ను ప్రభుత్వం అమలు చేస్తోంది. 15 శాతం  + వృద్ధి రేటుపై ఫోకస్ చేసి 2047 నాటికి, 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా రూ.58 లక్షల తలసరి ఆదాయంతో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాష్ట్రం కృషి చేస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
SRH Memes: లక్నోను నలిపేయడం ఖాయమే -  సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
లక్నోను నలిపేయడం ఖాయమే - సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
Embed widget