Vishal: హీరో విశాల్ నటి కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? - ఆ డైరెక్టర్ ఆమెను అడిగారా!, అసలు ఏం జరిగిందంటే?
N Linguswamy: తమిళ డైరెక్టర్ లింగుస్వామి వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. స్టార్ హీరో విశాల్.. నటి కీర్తి సురేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు.

Tamil Director Said N.Linguswamy Said That Vishal Wanted To Marry Keerthy Suresh: కీర్తి సురేశ్ (Keerthy Suresh).. తన అందం, అభినయం, నటనతో యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు సైతం దగ్గరయ్యారు. నేటి తరం యంగ్ హీరోయిన్స్‌లో నేషనల్ అవార్డుతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సత్తా చాటారు. కీర్తి సురేశ్ తల్లి మేనక తమిళ, మలయాళ సినిమాల్లో ఫేమస్ కాగా తండ్రి సురేష్ నిర్మాత కావడంతో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా.. మలయాళంలో ఆశించినంత స్థాయి గుర్తింపు రాలేదు.
కెరీర్ పరంగా తొలుత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. తెలుగులో 'నేను శైలజ'తో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. అనంతరం టాప్ హీరోల సరసన పలు సినిమాల్లో నటించారు. 'మహానటి'తో జాతీయ అవార్డు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. 'మహానటి' (Mahanati) తర్వాత పలు సినిమాల్లో నటించినా అనుకున్నంత హిట్ కాలేదు. మళ్లీ నాని 'దసరా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే ఆమె 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
Also Read: ఆ ఓటీటీలోకి అజిత్ యాక్షన్ థ్రిల్లర్ 'విడాముయర్చి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
విశాల్.. కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా..?
అయితే, తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal).. నటి కీర్తి సురేశ్‌ను పెళ్లి చేసుకోవానుకున్నారట. ఈ విషయాన్ని తమిళ డైరెక్టర్ లింగుస్వామి (Linguswamy) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో చెప్పారు. కీర్తి, విశాల్‌తో కలిసి అప్పట్లో 'పందెంకోడి 2' సినిమా చేశారు. షూటింగ్ సెట్స్‌లో కీర్తి అందరితో వ్యవహరించే తీరు, మాట్లాడే విధానం, అందరి పట్ల చూపించే ప్రేమ.. వంటి లక్షణాలు హీరో విశాల్, అతని తండ్రికి బాగా నచ్చాయట. అప్పుడు విశాల్ తండ్రి.. డైరెక్టర్ లింగుస్వామితో తన కొడుకు విశాల్‌ని పెళ్లి చేసుకుంటారా..? అని కీర్తి సురేశ్‌ను అడిగించారట. లింగుస్వామి ఒక్కసారిగా అలా అడగ్గానే కీర్తి కాస్త ఇబ్బంది పడుతూ.. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని అనే అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు.. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ఈ విషయాన్ని తెలుసుకున్న విశాల్ మంచి అమ్మాయిని మిస్ అయ్యానని ఫీల్ అయ్యారట. కీర్తి ఎదుగుదలకు ఆంటోని బాగా సపోర్ట్ చేసినట్లు లింగుస్వామి చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేశ్, తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనిని ఇటీవలే గోవాలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన భర్తతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే.. కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోకి 'బేబీ జాన్' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 24న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.






















