Summer Foods : సమ్మర్ హీట్‌ని బీట్ చేస్తూ.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవే, వేసవిలో వీటిని ఫాలో అయిపోండి
Summer 2025 : ఏదైనా పనిమీద బయటకు వెళ్తే.. ఏమి ఎండలు రా సామి అనిపించేంతలా భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సయమంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

Summer Hydrating Foods : ఎండలు బాబోయ్ ఎండలు. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే.. రానున్నురోజుల్లో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదూ. అందుకే ఈ సమ్మర్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి. అంతేనా వేడిని తగ్గించి హైడ్రేటింగ్‌గా ఉంచడంతో పాటు.. బరువును కంట్రోల్ చేసే ఫుడ్స్ ఏంటో చూసి.. హెల్తీగా ఈ సమ్మర్‌ను దాటేయండి.
సమ్మర్లో హీట్‌ని బీట్ చేయడానికి కొన్ని పండ్లు ఎక్కువగా తీసుకుంటాము. అలాగే ఈ సమయంలో కొన్ని రకాల కూరగాయలు, ఇతర హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. వాటిలోని విటమిన్స్, మినరల్స్ మిమ్మల్ని హెల్తీగా ఉంచడంతో పాటు.. పాటు బరువు తగ్గించడంలో, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో? వాటిలో ఉంటే మినరల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హెల్తీ స్నాక్స్..
సమ్మర్లో స్నాక్‌గా పండ్లు తీసుకోవచ్చు. ఇవి హైడ్రేటింగ్‌గా ఉంచుతూ.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిలో మొదటి స్థానంలో పుచ్చకాయం ఉంటుంది. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో కూడా 92 శాతం నీరు ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ద్రాక్షల్లో 91 శాతం నీరు, విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఖర్బూజాలలో 90 శాతం నీరు, విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. పైనాపిల్‌లో 88 శాతం నీరు, విటమిన్ సి, మాంగనీస్ ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తూ.. హైడ్రేటింగ్‌గా ఉంచుతూ బరువు తగ్గేలా చేస్తాయి.
కూరగాయల్లో
కీరదోసను సమ్మర్లో కచ్చితంగా తీసుకోవాలి అంటారు. దీనిలో 96 శాతం నీరు ఉంటుంది. పైగా కేలరీలు బాగా తక్కువ. విటమిన్ కె ఉంటుంది. సెలరీలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ కె ఉంటుంది. 95 శాతం నీటితో నిండి ఉంటుంది. టమాటాల్లో విటమిన్ సి, లింకోపెనె, 95 శాతం నీరు ఉంటుంది. పెప్పర్స్‌లో 92 శాతం నీరు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్స్‌లో విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉండి 87 శాతం నీరు ఉంటాయి. కాబట్టి వీటిని మీరు నేరుగా లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.
మరింత హైడ్రేటెడ్‌గా ఉండేందుకు..
చికెన్‌తో చేసిన లేదా కూరగాయలతో చేసిన సూప్స్‌ని డైట్లో చేర్చుకోండి. ఇవి హైడ్రేటింగ్‌గా ఉంచుతూ కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పుదీనా, చమోలీ, మందార టీలు రెగ్యులర్‌గా తీసుకుంటే హైడ్రేషన్‌ని పెంచుతాయి. లో ఫ్యాట్ మిల్క్‌లో 87 శాతం నీరు ఉంటుంది. కాల్షియం, ప్రొటీన్ శరీరానికి అందుతుంది. యోగర్ట్‌లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉండి.. శరీరానికి ప్రొబయోటిక్స్, ప్రోటీన్ అందుతుంది. మీరు పెరుగును మజ్జిగగా చేసుకుని కూడా వాడుకోవచ్చు.
సమ్మర్ హీట్‌ని బీట్ చేసేందుకు మరిన్ని టిప్స్
హైడ్రేటెడ్‌గా ఉంచే ఫుడ్స్‌ని భోజనంలో, స్నాక్స్‌లో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. నట్స్, సీడ్స్, అవకాడోలు, ఆలివ్ నూనెను డైట్లో చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తే మంచిదని.. దానికి బదులు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సూచిస్తున్నారు. వీటితో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
Also Read : సమ్మర్లో ఖర్బూజ తింటే చాలా మంచిది.. కానీ గింజలతో డబుల్ బెనిఫిట్స్ ఉన్నాయట, పడేయకండి






















