వేసవికాలంలో రాగి ఉసిరికాయలు తినొచ్చా? లాభాలున్నాయా?
పోషకాలతో నిండిన ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అయితే వీటిని సమ్మర్లో తినొచ్చా? మంచిదేనా?
వేసవిలో కచ్చితంగా ఆమ్లాను తీసుకోవచ్చు. వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.
వీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
సమ్మర్లో వేడిని తగ్గించుకునేందుకు వీటిని డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.
అయితే ఇవి చల్లదనాన్ని ఇచ్చినా.. ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
అలాగే ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయట. డయేరియా సమస్యను పెంచుతాయట.
రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరి తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. అంతకుమించి తినకపోవడమే మంచిదట.
తేనె, అల్లం, యోగర్ట్ వంటివాటితో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది.