Pak vs Ind Match Highlights | Champions Trophy 2025 లో పాక్ పై భారత్ జయభేరి | Virat Kohli | ABP
వేట..వేటే ఇది. ఫామ్ లో లేడు అన్నారు. సీన్ అయిపోయింది అన్నారు. కానీ ఎడారి దేశంలో దుబాయ్ గ్రౌండ్స్ లో బార్బెక్యూ పెట్టేశాడు. ఈసారి బలైపోయింది ప్రియమైన ప్రత్యర్థి పాకిస్థాన్. టార్గెట్ 242 పరుగులే. కానీ అదేమంత అంత ఈజీగా వచ్చేయలేదు. పాకిస్థాన్ బౌలింగ్ వీక్ గా ఉంది సరే కానీ ఔట్ ఫీల్డ్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. నువ్వు ఎంత బలంగా బాదినా బంతి పడిన మీద దుప్పటి కప్పుకుని పడుకుంటున్న టైమ్ లో ఓపికగా ఆడాడు ఛేజ్ మాస్టర్. ముందు ప్రిన్స్ శుభ్ మాన్ గిల్ తో ...తర్వాత స్పీడీ శ్రేయస్ అయ్యర్ తో ఫర్ ఫెక్ట్ గా పార్టనర్ షిప్ బిల్డ్ చేశాడు. క్రికెట్ బుక్ లో తన పేరు మీదున్న క్లాసిక్ షాట్స్ జస్ట్ రిఫర్ చేశాడేమో...అందమైన కవర్ డ్రైవ్ లు అద్భుతమైన టూడీలు..త్రీడీలు..కళ్ల ముందు లక్ష్యం కరిగిపోతున్నా..సెంచరీ చేస్తాడా లేదా అన్న టెన్షన్ ఉన్నా...అస్సుల తీసుకోలేదు మహారాజు. కాలిక్యులేటెడ్ గా ఆడాడు. తనను ఎందుకు ఛేజ్ మాస్టర్ అంటారో లాక్ డౌన్ తరానికి చూపించాడు. ఛేజింగ్ లో 28వ సెంచరీ..వన్డేల్లో 51వ సెంచరీ...ఓవరాల్ గా 82వ ఇంటర్నేషనల్ సెంచరీ బాదుతూనే టీమిండియాకు కావాల్సిన టార్గెట్ ఛేజ్ చేసి పెట్టాడు కింగ్ విరాట్ కొహ్లీ. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఏ పాకిస్థాన్ పై ఆఖరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడో అదే స్థాయి ఓపికతో తన మీద తనకు అచంచలమైన నమ్మకంతో పరుగు పరుగు పేర్చుకుంటూ పరిపూర్ణమైన సెంచరీ బాదేశాడు. ఈ ఓటమితో పాకిస్థాన్ తదుపరి దశకు వెళ్లటం సంక్లిష్టం కాగా భారత్ నెక్ట్స్ స్టేజ్ కి క్వాలిఫై అయిపోయింది.




















