అన్వేషించండి

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’లో గెస్ట్ రోల్స్ చేస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు - వాళ్లెవరో తెలుసా?

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Kalki 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.    

‘కల్కి 2898 ఏడీ’మూవీలో ఇద్దరు యంగ్ హీరోలు!

ప్రతిష్టాత్మక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఇద్దరు యంగ్ హీరోలు అతిథి పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది.  మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కనిపించేది కొద్దిసేపే అయినా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లో వీరిద్దరి షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్లు సమాచారం. వాస్తవానికి వీరిద్దరు ‘కల్కి’ చిత్రంలో కనిపించనున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది.  'కింగ్‌ ఆఫ్‌ కోథా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్‌, ‘కల్కి’ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఆ సినిమా సెట్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. కానీ, ఆయన మాటలను బట్టి, ఈ చిత్రంలో నటించబోతున్నారని అర్థం అయ్యింది. ఇప్పుడు అది వాస్తవం అని తెలుస్తోంది.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథ ఏంటనే విషయంలో ఇప్పటికే మేకర్స్ చాలా క్లూస్ ఇచ్చారు. టైం ట్రావెలర్ మూవీ అని వెల్లడించారు. భవిష్యత్ తో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు. మోడ్రన్ కాలానికి పురాణాల పవర్ యాడ్ అయితే, ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త గెటప్ లో అలరించనున్నట్లు తెలుస్తోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఇక ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లలో విడుదల ప్లాన్ చేస్తున్నారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మహర్షి', 'మహానటి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అదే డేట్ కి వచ్చాయి. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ప్రభాస్ సినిమాని మే 9న విడుదల చేయటానికి రెడీ అయ్యారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ పెద్ద మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుంది.

Read Also: థియేటర్లలో విడుదలైన 19 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమా

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ వెరీ డెడికేటెడ్ - కారవాన్స్, అసిస్టెంట్స్ ప్రచారంపై రణబాలి ప్రొడ్యూసర్స్ సీరియస్
విజయ్ దేవరకొండ వెరీ డెడికేటెడ్ - కారవాన్స్, అసిస్టెంట్స్ ప్రచారంపై రణబాలి ప్రొడ్యూసర్స్ సీరియస్
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
Nindu Manasulu Serial Today June 26th: నిండు మనసులు: లంచం కేసులో గణ అరెస్ట్! హనీమూన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
నిండు మనసులు: లంచం కేసులో గణ అరెస్ట్! హనీమూన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
Friday OTT Releases : బాహుబలి టార్చ్‌బేరర్ To హారర్ థ్రిల్లర్ సిరీస్ - శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్
బాహుబలి టార్చ్‌బేరర్ To హారర్ థ్రిల్లర్ సిరీస్ - శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
SBI Caps Hyderabad Metro Valuation: హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
Embed widget