Tirupati News: నేడు తిరుపతి 895వ ఆవిర్భావ దినోత్సవం, వేడుకలు నిర్వహించని కూటమి ప్రభుత్వంపై విమర్శలు
Happy Birthday Tirupati: మూడేళ్ల పాటు వైభవంగా సాగిన తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేడుకలు లేకుండా పోయాయి. నేడు 895 వ ఆవిర్భావ దినోత్సవం

Tirupati News: తిరుపతి: నాటి గోవిందరాజపురం నుంచి నేటి తిరుపతి మహానగరం
తిరుపతి ఆధ్యాత్మిక మహానగరం కోట్లాది మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా రావాలనుకునే ప్రదేశం. కలియుగ వైకుంఠనాధుడు దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఈ నగరం ఆవిర్భవించి నేటికి 895 సంవత్సరాలు.
ప్రతి వ్యక్తి జీవితంలో పుట్టిన రోజు అనేది మరచిపోలని జ్ఞాపకం. ఇలాంటి పుట్టిన రోజు ఓ పట్టనానికి కూడా ఉంది.. అదే తిరుపతి. 1130 ఫిబ్రవరి 24న సౌమ్య నామ సంవత్సర పాల్గుణ పౌర్ణమి ఉత్తర నక్షత్రం లో సోమవారం రోజున శ్రీ భగవత్ రామానుజాచార్యులు గోవిందరాజపురంగా నామకరణం చేశారు. శ్రీరంగపట్నం నుంచి గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని తిరుపతిలో పెట్టాలని నిర్ణయించారు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చే క్రమంలో విగ్రహం ముక్కపోవడంతో దానిని తిరుపతిలోని మంచినీళ్ళ గుంట వద్ద పెట్టారు. నాడు రామానుజాచార్యులు వారు మరో సున్నపు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. అదే నేడు గోవింద రాజ స్వామి వారి ఆలయం లో మనకు దర్శనం ఇచ్చే విగ్రహం. ఆయన తిరుపతికి నామకరణం చేసిన తరువాత చాల సంవత్సరాలు ఆవిర్భావ వేడుకలు నిర్వహించేవారని పలువురు తెలిపారు. రానురాను ఆ సంస్కృతి మరుగునపడిపోయింది. దీంతో తిరుపతి పుట్టిన రోజు తెలియకుండా పోయింది.
అంతరించిపోయిన వేడుకలకు ప్రాణం
తిరుపతి కి చెందిన టీఎంసీ భాస్కర్ చాలా సంవత్సరాల నుండి తిరుపతి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. మరుగున పడిన తిరుపతి పుట్టిన రోజు వేడుకలను స్థానికులు, పలువురు నాయకులతో కలిసి తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత టెంకాయలు కొట్టి పూజలు చేసే వారు. అనంతరం భక్తులకు, స్థానికులకు అన్నదానం చేసేవారు. ఇలా పున ప్రారంభమైన తిరుపతి పుట్టిన రోజు వేడుకలు కోవిడ్ సమయంలో నిలిచిపోయాయి. నాటి తిరుపతి ఎమ్మెల్యే గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తాతయ్యగంట గంగమ్మ ఆలయం లో బయపడ్డ శిలాశాసనం లో కూడా తిరుపతి ఆవిర్భావం గురించి ఉంది తెలియజేశారు. కొవిడ్ అనంతరం తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూడేళ్ల పాటు తిరుపతి మొత్తం పండుగ వాతావరణం లో పుట్టిన రోజును ఘనంగా కరుణాకర్ రెడ్డి నిర్వహించారు.
నేడు 895 ఆవిర్భావ దినోత్సవం
తిరుపతి నగరం ఆవిర్భవించి నేటికి 895 సంవత్సరాలు పూర్తి అయ్యింది. గడిచిన మూడేళ్ల పాటు వైసీపీ సర్కార్ వేడుకలు నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుపతి ఖ్యాతిని ప్రపంచానికి చాటే వేడుకలు నిర్వహించాల్సింది పోయి అసలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వేడుకలను అధికారంలో ఉననప్పుడే కాకుండా ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ నాయకులు ముందుండి ఘనంగా నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

