PM Modi Counter Maldives President Muizzu | బీచ్ ఒడ్డున సింగిల్ ఛైర్ వేసుకున్న ఎఫెక్ట్ | ABP Desam
ఓ ఏడాది క్రితం మీకు గుర్తుంటే దేశమంతటా ఈ వీడియో ఓ ఊపు ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నపళంగా లక్ష ద్వీప్ కి వెళ్లి అక్కడ ఛైర్ వేసుకుని కూర్చున్న వీడియో ఇది. ఎక్కడా ఏం మాట్లాడలేదు ఆయన. ఏ దేశానికి వెళ్లొద్దు అనలేదు. అలానే లక్షద్వీప్ కి రమ్మని పిలవలేదు. కానీ బ్యాన్ మాల్దీవ్స్ అనే నినాదం మారు మోగిపోయింది. దానికి రీజన్ ఈయనే. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జు ఇండియా ఔట్ అంటూ ఓ క్యాంపెయిన్ రన్ చేశాడాయన. మన దేశానికి సంబంధించిన ఆర్మీ కొంత మంది మాల్దీవుల ఉండటాన్ని నిరసిస్తూ భారత కార్యకలాపాలు తమ దేశంలో వద్దంటూ ఓ రకంగా ఓవరాక్షన్ చేశాడు. భారత్ అధికారులు అక్కడుంది హిందూ మహాసముద్రంలో చైనా తోకాడిచకుండా చూసుకోవటానికి. దానికి మాల్దీవ్స్ ఓ దారి కాబట్టి వాళ్ల దగ్గర పోర్టులు కడతాం..డెవలప్మెంట్స్ చేస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ను బుట్టలో వేసుకుంది చైనా. ఫలితంగా ఈ మొయిజ్జు కూడా భారత్ తమకు వద్దంటూ హడావిడి చేశారు. దీంతో మండిన మోదీ బంగారం లాంటి లక్షద్వీప్స్ మనకు పెట్టుకుని మాల్దీవ్స్ ఎందుకు అని చిన్న వీడియో షూట్ చేయించి లక్షద్వీవులో రిలీజ్ చేస్తే మాల్దీవ్స్ పర్యాటకం అతలాకుతం అయ్యింది. ఆ దెబ్బకు దిమ్మ తిరిగింది. ఏడాది తిరిగే సరికి మాల్దీవ్స్ ప్రయారిటీస్ మారిపోయాయి. నమ్మించి మోసం చేయటం తప్ప చైనా ఏం చేయదని గ్రహించి మళ్లీ అదే మొయిజ్జు నే మోదీని మాల్దీవ్స్ కి 60వ స్వాతంత్ర్య వేడుకలకు రమ్మన్నారు. అక్కడితో ఆగలేదు మాల్దీవ్స్ రక్షణ మంత్రిత్వ కార్యాలయంపై ఇదిగో ఇలా మోదీ ఫోటోను ప్రదర్శించి మరీ వెల్కమ్ చెప్పారు మాల్దీవ్స్ అధ్యక్షుడు. మొత్తానికి దారికొచ్చిన మాల్దీవులను మోదీ కరుణించారు. భారత్ కు వ్యూహాత్మక రక్షణలో భాగంగా మాల్దీవ్స్ అవసరాన్ని గుర్తించి 4వేల 850 కోట్ల రూపాయాన్ని రుణాన్ని ఆ దేశానికి ప్రకటించారు. అలా బీచ్ లో సింగిల్ చైర్ వేసుకుని మోదీ తీసిన ఒక్క వీడియో...ఇప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వ కార్యాలయంపైనే మోదీ ఫోటో పెట్టుకునేంత వరకూ తీసుకొచ్చి...భారత్ మాల్దీవులకు సరైన బుద్ది చెప్పింది.





















