అన్వేషించండి

Sai Kumar: 'మయసభ'లో సీనియర్ ఎన్టీఆర్‌గా సాయి కుమార్? - డైలాగ్ కింగ్‌కు డైరెక్టర్ దేవా కట్టా స్పెషల్ బర్త్ డే విషెష్

Mayasabha Web Series: ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'మయసభ'లో సీనియర్ ఎన్టీఆర్ రోల్‌ను డైలాగ్ కింగ్ సాయికుమార్ పోషించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ దేవాకట్టా షేర్ చేసిన పోస్టర్ దీనికి బలం చేకూరుస్తోంది.

Dialogue King Sai Kumar Plays NTR Role In Mayasabha Series: దేశ రాజకీయ చరిత్రలోనే ఆ ఇద్దరూ ఓ సెన్సేషన్. ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా వైఎస్సార్, చంద్రబాబు పొలిటికల్ లైఫ్‌పై రూపొందిన  ఎక్స్‌క్లూజివ్‌ వెబ్ సిరీస్ 'మయసభ'. డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వం వహించగా... ఇటీవల రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

ఎన్టీఆర్ రోల్‌లో సాయి కుమార్?

ఈ సిరీస్‌లో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ఎవరు చేశారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ పాత్రను డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ దేవా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ... 'తుక్కు రేగ్గొట్టారు!!!' తెలుగు ఆడియన్స్ ఆగస్ట్ 7న మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు.' అంటూ ట్వీట్ చేశారు. కారుపై భారీ ర్యాలీగా అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.

'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య' తర్వాత 'మయసభ' సిరీస్ కోసం సాయికుమార్‌‌తో మూడోసారి పని చెయ్యడం చాలా ఎంజాయ్ చేసినట్లు దేవా కట్టా తెలిపారు. 'సాయికుమార్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని మీ అభిమానిగా ఆశిస్తున్నా.' దీంతో అధికారికంగా రివీల్ చేయకపోయినా... ఈ సిరీస్‌లో ఆయన సీనియర్ ఎన్టీఆర్ రోల్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గాంభీర్యం, డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అవుతాయని అంటున్నారు.

Also Read: చిరంజీవి 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ - కీరవాణిపై థంబ్ నైల్స్‌... రూమర్స్‌పై డైరెక్టర్ వశిష్ట ఫుల్ క్లారిటీ

చంద్రబాబు వర్సెస్ వైఎస్సార్

పొలిటికల్ లెజెండ్స్ చంద్రబాబు, వైఎస్సార్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్సార్ పాత్రలో చైతన్యరావు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. డైరెక్ట్‌గా పేర్లు వాడకున్నా కాకర్ల కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు కనిపించనున్నారు. 

టీజర్‌పై సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు రాగా... దీనిపై డైరెక్టర్ దేవా కట్టా స్పందించారు. 'పాలిటిక్స్ ఓ గౌరవప్రదమైన పోటీ. అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ. ఏకీభవించని వాళ్లను అంతం చేసే ప్రతిజ్ఞ కాదు.' అంటూ ఇటీవల ట్వీట్ చేశారు. 

ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్

ఈ సిరీస్‌ను హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. దేవా కట్టాతో పాటు కిిరణ్ జయకుమార్ రూపొందించారు. ఆగస్ట్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget