Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ - కీరవాణిపై థంబ్ నైల్స్... రూమర్స్‌పై డైరెక్టర్ వశిష్ట ఫుల్ క్లారిటీ
Vishwambhara Special Song: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో స్పెషల్ సాంగ్‌కు భీమ్స్ మ్యూజిక్ అందించడంపై వస్తోన్న రూమర్లపై డైరెక్టర్ వశిష్ట మల్లిడి స్పందించారు. కీరవాణి సర్ సలహా మేరకే అలా చేశామన్నారు.

Director Mallidi Vassishta About Vishwambhara Special Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌ను సైతం కంప్లీట్ చేశారు మేకర్స్. ఈ ఐటమ్ సాంగ్‌పై సోషల్ మీడియా వేదికగా వస్తోన్న రూమర్స్‌పై డైరెక్టర్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
కీరవాణిపై థంబ్ నైల్స్
'విశ్వంభర' మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా... ఈ ఐటమ్ సాంగ్‌కు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. పలు యూట్యూబ్ ఛానల్స్ సైతం 'కీరవాణికి అవమానం' అంటూ థంబ్ నైల్స్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై డైరెక్టర్ వశిష్ట తాజాగా రియాక్ట్ అయ్యారు.
కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడంతోనే భీమ్స్‌ను తీసుకున్నామనేది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు వశిష్ట. 'కొన్ని యూట్యూబ్ ఛానళ్లు 'ఆస్కార్ విన్నర్ కీరవాణిని అవమానించారు' అంటూ థంబ్ నైల్స్ క్రియేట్ చేసి తమకు తోచింది చెప్పాయి. స్పెషల్ సాంగ్ చేయాల్సిన టైంలోనే కీరవాణి 'హరిహర వీరమల్లు' మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఈ సాంగ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారు. అదేంటి సర్ అని నేను అడిగితే... ఇందులో తప్పేముంది? సినిమాలో పాటలను వేర్వేరుగా రాస్తారు కదా అన్నారు. నా ఫస్ట్ మూవీ 'బింబిసార'కు చిరంతన్ భట్‌తో కలిసి వర్క్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి గారికి కూడా ఆయనే చెప్పారు. అలా భీమ్స్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు.' అంటూ స్పష్టం చేశారు.
Also Read: 'హరిహర వీరమల్లు' కలెక్షన్స్ - డైరెక్టర్ జ్యోతికృష్ణ రియాక్షన్... 3 రోజుల వసూళ్లు ఎంతంటే?
రూమర్స్‌పై క్లారిటీ
ఈ ఐటమ్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ స్టెప్పులేశారు. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో 'రిక్షావోడు', 'ముఠామేస్త్రి' చిత్రాల థీమ్ మ్యూజిక్ వినిపిస్తుందని కొంత ప్రచారం సాగుతోంది. అలాగే, ఖైదీలోని 'రగులుతుంది మొగలిపొద' రీమేక్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కూడా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ఈ పాట దేనికీ రీమేక్ కాదని... మెగాస్టార్ గత మూవీస్‌లో ఏ పాటను పోలి ఉండదని స్పష్టం చేశారు. ఇది ఫ్రెష్ సాంగ్ అని అన్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ... సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని... పండుగకు ఆయన సినిమా రావాలని కోరుకోనని అన్నారు. 'చిరంజీవి సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండుగ.' అంటూ చెప్పారు. వీఎఫ్ఎక్స్ పనులన్నీ పూర్తైతే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సత్యలోకానికి వెళ్లి హీరోయిన్‌ను హీరో ఎలా తెచ్చుకున్నారనేదే స్టోరీ లైన్ అంటూ వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.





















