Mothevari Love Story Series Trailer: పర్సిగాడి ప్రేమ పంచాయతీ - ఆసక్తికరంగా 'మోతెవరి లవ్ స్టోరీ' సిరీస్ ట్రైలర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mothevari Love Story: తెలంగాణ యాసలో లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా మరో వెబ్ సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది.

Anil Geela's Mothevari Love Stroy Trailer Out: ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'మోతెవరి లవ్ స్టోరీ' ట్రైలర్ తాజాగా నవ్వులు పూయిస్తోంది. ఈ సిరీస్‌లో అనిల్ జీల, వర్షిణి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా... శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.
ట్రైలర్... నవ్వులే నవ్వులు
'మోతెవరి లవ్ స్టోరీ' ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అనిల్ జీల, వర్షిణి రెడ్డిలతో పాటు బలగం మురళీధర్ గౌడ్, సాధన, సుజాత సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్, ఓ అందమైన లవ్ స్టోరీ ప్రధానాంశంగా సిరీస్ రూపొందినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ట్రైలర్‌కు యంగ్ హీరో ప్రియదర్శి వాయిస్ ఓవర్ అందించారు. 'ఇంగో ఇదే మా ఊరు ఆరేపల్లి. ఊరూరుకి ఓ మోతెవరి ఉన్నట్లు మా ఊరికి ఓ మోతెవరి ఉన్నాడు.' అంటూ తెలంగాణ యాస డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ఆకట్టుకుంటోంది.
ఆరేపల్లి గ్రామంలో ఓ యువకుడు పక్క ఊరిలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే గ్రామంలో ఉండే ఇద్దరు సోదరులు వారసత్వంగా వచ్చిన భూమి కోసం తగాదా పడుతున్న క్రమంలో వీరికి అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఓ వైపు భూ వివాదం, వారసత్వం... మరోవైపు వీరి ప్రేమ వివాదం ఏంటి అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్నీ కలగలిపి సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.
#MothevaariLoveStory Trailer Out Now
— VRMadhuPR (@VRMadhuPR) July 27, 2025
🔗https://t.co/8ufqMRbgMy@ZEE5Telugu #ZEE5Telugu #MothevariLoveStoryOnZEE5 pic.twitter.com/PPR7m33ltZ
ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేసింది. ఈ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. 'మై విలేజ్ షో' టీం నుంచి ఫస్ట్ టైం ఇలా సిరీస్ చేసినట్లు అనిల్ తెలిపారు. సిరీస్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని... లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఇందులో ఉంటాయని చెప్పారు. విజయ్ దేవరకొండ అన్న ద్వారానే సినిమాల్లోకి వచ్చానని అనిల్ తెలిపారు.





















