Mysaa Movie: రష్మిక మందన్న 'మైసా' మూవీ స్టార్ట్ - గిరిజనులతో నేషనల్ క్రష్ డ్యాన్స్
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' మూవీ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రష్మిక గిరిజనులతో గోండు పాటకు డ్యాన్స్ చేశారు.

Rashmika Mandanna's Mysaa Movie Shooting Started: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకూ ఎన్నడూ చేయని రోల్‌లో నేషనల్ క్రష్ నటిస్తున్నారు. రవీంద్ర పూలే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ.
పూజా కార్యక్రమాలతో ప్రారంభం
ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా... హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం అధికారికంగా పూజా కార్యక్రమాలతో మూవీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రష్మికతో పాటు మూవీ టీం హాజరయ్యారు. సురేష్ బాబు క్లాప్ బోర్డ్ ఇవ్వగా, రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. 

గిరిజనులతో రష్మిక సంప్రదాయ నృత్యం
పూజా కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక గిరిజనులతో సందడి చేశారు. గోండు పాటకు వారితో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రష్మిక యోధురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
#MYSAA Pooja Ceremony begins with blessings, love and the promise of a beautiful story ❤️✨
— UnFormula Films (@unformulafilms) July 27, 2025
Clap by #SureshBabu garu 🎬
Camera Switch on by @storytellerkola garu 📽
Script & First shot direction by @hanurpudi garu 📝
Here’s to new journeys & soulful storytelling 💫… pic.twitter.com/zmAhsHuzso
'మైసా' అంటే...
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ కనిపించలేని రీతిలో రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కుపుడకలో భయంకరంగా ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. 'మైసా' టైటిల్‌తో పాటు ఆమె లుక్ కూడా ఆసక్తిని పెంచేసింది. 'మైసా' అంటే స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల మూలాల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్వేచ్ఛా ఆలోచనల నుంచి వచ్చిన ఓ సహజ నాయకురాలు, వారియర్‌గా నేషనల్ క్రష్ కనిపించబోతున్నారు. 'మైసా' అంటే అమ్మ అని అర్ధం. గోండు తెగల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కుతుండగా... వారి హక్కులను ఓ యోధురాలిగా ఆమె ఎలా కాపాడారనేదే స్టోరీ. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది.






















