PM Modi Sips Indian Tea with UK Prime Minister | యూకే పర్యటనలో ఆ దేశ ప్రధానికి టీ రుచి చూపించిన మోదీ | ABP Desam
ప్రధాని మోదీ యూకే పర్యటన విజయంతమైంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ యూకే ప్రధానమంత్రి కీవ్ స్టార్మర్ టీ విందు ఇచ్చారు. లండన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ టీ స్టాల్ దగ్గర మన అస్సాం, కేరళ స్పైసెస్ టీని యూకే ప్రధాని కీవ్ స్టార్మర్ కు రుచి చూపించారు. ఈ సందర్భంగా టీ స్టాల్ నిర్వహించిన వ్యక్తి భారతీయ టీ రుచి నాణ్యత గురించి చెబుతూ యూకే ప్రధానికి టీని అందించారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి కూడా టీ ఇస్తూ ఓ ఛాయ్ వాలా మరో ఛాయ్ వాలాకు టీని అందిస్తున్నాడంటూ జోక్ చేశాడు. చాలా స్పోర్టివ్ గా తీసుకున్న ప్రధాని మోదీ హాయిగా నవ్వుతూ ఆ జోక్ ను ఎంజాయ్ చేశారు. ప్రధాని కాక ముందు గుజరాత్ లో రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మటంతో ప్రధాని మోదీ ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే.





















