Rave Party In Kondapur | కొండాపూర్‌లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
వీకెండ్ వచ్చిందంటే చాలు మందు, డ్రగ్స్ పార్టీలు.. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా పార్టీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడిచేశారు. శనివారం రాత్రి స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం సిఐ సంధ్య బాలరాజు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లి దాడి చేశారు.
పార్టీ జరిగిన చోట పెద్ద ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి. రెండు కేజీల గంజాయితో పాటు 50 గ్రాముల కుష్ డ్రగ్, 11.5 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్, 1.9 గ్రాముల మరో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు అనే వ్యక్తి ఫేక్ ఆధార్ కార్డులతో కొందర్ని హైదరాబాద్ తీసుకొచ్చి వీకెండ్స్ లో డ్రగ్స్, రేవ్ పార్టీలు నిర్వహించి తిరిగి ఏపీకి పంపిస్తుంటాడు. ఎస్టిఎఫ్ బి టీం పట్టుకున్న నిందితులను శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన 9 మందిని అరెస్ట్ చేసారు. పార్టీలో పాల్గొన్న వారు మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.





















