India vs England Day 4 Highlights | ఇండియా ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో సత్తా చాటిన గిల్, రాహుల్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగోటెస్టులో డ్రా కోసం భారత్ పోరాడుతోంది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. నాలుగోరోజు ఆటముగిసేసరికి భారత్ 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది.
నాలుగో రోజు ఆటలో రాహుల్-గిల్ భాగస్వామ్యామే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. పరుగులేమీ చేయకుండానే టీమిండియా రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గిల్ మాత్రం కాస్త వేగంగా ఆడాడు.
టీ విరామం తర్వాత గిల్, రాహుల్ మంచి ఫార్మ్ కనబర్చారు. గిల్ అర్ధ సెంచరీ చేయగా, ఆ తర్వాత రాహుల్ ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. వీలైనంత వరకు బ్యాటింగ్ చేసి, మ్యాచ్ ను డ్రా చేసుకోవాలని టీమిండియా ఎదురుచూస్తుంది. మరి ఈ మ్యాచ్ ఎలా ముగుస్తుందో చూడాలి.





















