OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తమన్నా క్రైమ్ డ్రామా... స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
Sikandar ka Muqaddar OTT Release Date: తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'సికిందర్ కా ముక్‌దార్'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ఈ రోజు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.

Tamannaah Bhatia's Sikandar ka Muqaddar Release Date Netflix: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ఓటీటీ ప్రాజెక్ట్స్ చేయడం కొత్త కాదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేశారు. ఇప్పుడు ఆవిడ ఓ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'సికిందర్ కా ముక్‌దార్'. డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
నీరజ్ పాండే దర్శకత్వంలో క్రైమ్ డ్రామా...
హిందీలో 'స్పెషల్ 26', 'ఏ వెడ్‌నెస్ డే', 'బేబీ' వంటి థ్రిల్లర్ సినిమాలతో పాటు 'ఎంఎస్ ధోని' బయోపిక్ తీసిన దర్శకుడు నీరజ్ పాండే. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'సికిందర్ కా ముక్‌దార్'. ఇందులో తమన్నా ఓ మెయిన్ లీడ్ రోల్ చేయగా... జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి ఇతర మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాను ఈ నెలాఖరున ఓటీటీలోకి వస్తోంది.
నవంబర్ 29 నుంచి 'సికిందర్ కా ముక్‌దార్' స్ట్రీమింగ్
పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా 'సికిందర్ కా ముక్‌దార్'ను నీరజ్ పాండే తెరకెక్కించారు. ఈ నెల 29న వీక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తున్నట్లు, తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
Also Read: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
View this post on Instagram
నెట్‌ఫ్లిక్స్ కోసం ఇంతకు ముందు 'ఖాకీ: ది బీహార్ ఛాప్టర్' తీశారు దర్శకుడు నీరజ్ పాండే. అది వీక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. దానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడీ 'సికిందర్ కా ముక్‌దార్' సినిమా చేశారు. 'ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిలో దోషి ఎవరు?' అంటూ సినిమాపై ఆసక్తి కలిగించారు.
Tamannaah Bhatia upcoming movies in Telugu: ఓటీటీ కోసం ఇంతకు ముందు 'ఎలెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీ', 'జీ కర్దా', 'ఆఖరి సచ్' చేశారు తమన్నా. ఆవిడ 'సికిందర్ కా ముక్‌దార్'లో ఎటువంటి రోల్ చేశారు? ఈ సినిమా ఎలా ఉంటుంది? అనేది నెలాఖరున తెలుస్తుంది. ఇది కాకుండా తమన్నా చేస్తున్న సినిమాలకు వస్తే... సంపత్ నంది సూపర్ విజన్ (దర్శకత్వ పర్యవేక్షణ)లో తెరకెక్కుతున్న 'ఓదెల 2'లోనూ ఆమె నటిస్తున్నారు. ఆ సినిమాలో నాగ సాధువు / మహిళా అఘోరాగా కనిపించనున్నారు. ఈ మధ్య హిందీ సినిమాలు ఎక్కువ చేయడం మొదలు పెట్టారు తమన్నా. అదే సమయంలో సౌత్ సినిమాలను చిన్న చూపు చూడటం లేదు. అవకాశాలు వచ్చిన ప్రతిసారీ కొత్త సినిమాలు అంగీకరిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

