GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP Desam
వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ.. చంద్రబాబు గారూ మిమ్మల్నే. మీ పార్టీ వాళ్లు ఇస్తున్న వేకప్ కాల్ మీకు చేరుతోందా.. బహుళా చేరి ఉండొచ్చు. ఇది ఇప్పుడు మొదలవలేదు..కొన్ని నెలలుగా మీ పార్టీని మీ వాళ్లే సోషల్ మీడియాలో చెండాడుతున్నారు. కొన్నాళ్లుగా కొంచం కొంచంగా ఉన్న వ్యతిరేకత నిన్న ఒక్క సారిగా అవుట్ బరస్ట్ అయింది. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా ఆయనకు మద్దతుగా.. మీకు వ్యతిరేకంగా పోస్టుల వరద కొనసాగుతోంది. ఇది చేస్తోంది ప్రత్యర్థి పార్టీల వాళ్లు కాదు. మీ టీడీపీ అభిమానులే. ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికైనా ఆలోచించుకోండి అంటూ అల్టిమేటమ్ కూడా ఇస్తున్నారు. మరి మీరు చూస్తున్నారా..? టీడీపీ సోషల్ మీడియా ఓ 24 గంటలుగా ఇంటర్నెట్ ను హోరెత్తిస్తోంది. సొంత పార్టీనే చెండాడుతోంది. పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల నుంచి ఎన్నికలకు ముందు ఆ పార్టీకి వాలంటరీగా సర్వీస్ చేసిన వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ టీడీపీ వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీలో మంట రేపింది. దానికి దారితీసిన పరిస్థితులు ఆ పార్టీ క్యాడర్‌కు చిర్రెత్తించాయి. ఫైబర్‌నెట్ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌కు మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం చివరకు ఛైర్మన్ రాజీనామా వరకూ వెళ్లింది. ఫైబర్‌నెట్ అవినీతిమయం అయిపోయిందని.. వైసీపీ హయాంలో చేరి విధులు నిర్వర్తించకుండా 400మందికి పైగా జీతాలు తీసుకుంటున్నారని.. సంస్థలోని ముఖ్య అధికారులు ఫైబర్‌నెట్‌ను పూర్తిగా దెబ్బ తీశారని జీవీరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆరోపించారు. వీటిన్నింటిని సరిదిద్దాలని బహిరంగంగా చెప్పారు.





















