AP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP Desam
హైందవ ధర్మం కోసం మతోన్మాది అని చెప్పే పిచ్చి డిబేట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువై పోయాయాన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పవన్...తనకు ఓట్లు పడకపోయినా పర్లేదు నమ్మిన ధర్మం కోసం బలంగా పోరాడతానని చెప్పారు. పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే " ఒక సగటు హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా హైందవ ధర్మం అవమాన పరుస్తున్నా దాన్ని దిగజార్చే మాట్లాడుతున్నా అప్పుడు వాయిస్ ఉండాలని కోరుకుంటా. ఈ కొత్త ఛానల్ వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది గాని ఇప్పటికి నేర్పుతుంది గాని మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర ' మీనాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్తే అక్కడ పూజారులు లోపల చూపిస్తా ప్రధాన పూజారులు ఎలాగ మధుర మీనాక్షి అమ్మ మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారు విదేశీ రాజులు వస్తున్నప్పుడు ఎలాగ దాన్ని ముష్కుర్లు వచ్చినపుడు ఎలా దాన్ని కాపాడారు చాలా కాలం ఇలాంటి చరిత్ర నాకు వెళ్తే గాని నాకు తెలియలా ఇలాంటి మనల్ని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురాక్రమణదారులు వచ్చి ఎలాగ ఇదే మూల విరాట విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు అంటే శివలింగం ఉంటుంది. శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది ఆ గాటు ఉంటుది కత్తి గాటు కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే మన గత చరిత్ర తెలిస్తే ఎంత అవసరం మనకి మనం ఎంత కాపాడుకోవాలి మనం ఏమనుకుంటాం అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం అన్ని మతాలు సమానమే కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ చావు కొడుతూ ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది నేనేమి బలమైన ఏమంటాని ఒక మంకు పట్టు పట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను అన్ని మతాలు బాగుండాలని కోరు అదే నా ధర్మం చెప్పింది. కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడులు చేస్తున్నప్పుడు దీని వల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం " అన్నారు.





















