GV Reddy Latest News: జీవీ రెడ్డి రాజీనామా ఇష్యూని వైసిపి వాడుకోవాలనుకుంటుందా?
Andhra Pradesh Latest News: జీవి రెడ్డి రాజీనామా ఇష్యూని లైవ్‌లో ఉంచేలా వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్సీ పోలింగ్ రోజు వరకు ఉంటే టీడీపీకి షాక్ తగులుతుందని అంచనా వేస్తోంది.

Andhra Pradesh Latest News: ఏ ఇష్యూకైనా సరే ఒక ట్రిగరింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రస్తుతం టిడిపి క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తికి మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా అలాంటి ఒక ట్రయరింగ్ పాయింట్‌గా మారిందా అంటే నిజమే అంటున్నారు ఎనలిస్ట్‌లు. సాధారణంగా ఒక పార్టీలో నుంచి ఎవరైనా బయటికి వెళ్లిపోతే ఆ పార్టీ క్యాడర్ సోషల్ మీడియా వర్గాలు సదరు నాయకుడుపై ఎలా విరుచుకుపడతాయో తెలిసిందే. అయితే విచిత్రంగా జీవీ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వెళ్ళిపోతే టిడిపి క్యాడర్ నుంచి తనకు సపోర్ట్ దొరుకుతోంది. ఏదో ఒకరిద్దరు మినహా జీవీ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు.
టిడిపి క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తే దీని కారణమా?
టిడిపి విపక్షంలో ఉండగా తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని అప్పటి అధికార పార్టీ శ్రేణులు, నాయకులు, వారి అధికార యంత్రాంగం నుంచి విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్నామనేది క్యాడర్ వాదన. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా తమను వేధించిన వారిపై చర్యలు సరిగ్గా తీసుకోవడం లేదనేది వారు ఆరోపణ. మీరు సరిగ్గా గమనిస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రెండు మూడు రోజులు హడావిడి చేసిన టిడిపి సోషల్ మీడియా వర్గం ఇప్పుడు పెద్దగా దానిపై హల్ చల్ చేయడం లేదు. వైసిపి సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డి అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు అంటూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. నిజంగా ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో టిడిపి సోషల్ మీడియా సైనికులు పూర్తిస్థాయిలో హడావుడి చేస్తారని భావించిన వాళ్లకి ఒక్కసారిగా షాక్ తగిలిందనే చెప్పాలి. దీనిపై వాళ్ళ నుంచి పెద్ద స్పందన రాలేదు అనే చెప్పాలి. దీనికన్నా జీవి రెడ్డి రాజీనామా అంశంపైనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో హంగామా నడుస్తోంది. చాలాకాలంగా అధిష్టానం వైఖరిపై వాళ్లకున్న అసంతృప్తిని బయట పెట్టడానికి జీవి రెడ్డి రాజీనామా ఒక ఆయుధంలా దొరికింది. నిజానికి సామాన్య టీడీపీ కార్యకర్త కోరుకుంటున్నట్టు ప్రజాస్వామ్యంలో అధిష్టానం ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కుదరకపోవచ్చు. కానీ టిడిపి హైకమాండ్ మాత్రం ఈ ఇష్యూని కార్యకర్తలకు సమాధానపరిచే రీతిలో కన్వే చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో అధిష్టానంపై ఈ స్థాయిలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇప్పుడు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసిపి చూస్తుందని సీనియర్ జర్నలిస్టులు ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఏపీ, తెలంగాణలోని ఆ జిల్లాల్లో మద్యం బంద్- ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్
టిడిపిలో పరిణామాలు గమనిస్తున్న జగన్
ప్రస్తుతం జీవి రెడ్డి ఇష్యూ బేస్ చేసుకుని టిడిపి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చని వైసీపీ క్లోజ్‌గా ఫాలో అవుతుందన్న అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేది యూత్. మరొక్క రోజు వ్యవధిలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక జరగబోతుంది. ఇందులో వైసీపీ ప్రత్యక్షంగా పాల్గొనక పోయిన అధికార టిడిపి క్యాండిడేట్ ఓడిపోతే ఎగిరి గంతేస్తుంది. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అసంతృప్త చర్చల వల్ల ప్రభావితమై టిడిపి సోషల్ మీడియాలోని పట్టభద్రులు, వారి వల్ల ఇన్ఫ్లుయన్స్ అయ్యే ఇతర ఓటర్లు టిడిపి బలపరిచిన అభ్యర్థికి షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదని వైసిపి భావిస్తోంది. దానితో ఎలాగైనా జీవి రెడ్డి రాజీనామా అంశంపై సోషల్ మీడియాలోనూ టిడిపి కార్యకర్తల్లోనూ జరుగుతున్న చర్చను మరొక రోజు లైవ్‌లోనే ఉంచాలని వైసిపి వ్యూహం పన్నుతోంది. ఇదే పైపెచ్చు తాము అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఇలానే ఎదురు దెబ్బతిన్న అనుభవం వైసీపీకుంది. కాబట్టి ఈ జీవి రెడ్డి ఇష్యూ మూలంగా జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఏమూలో ఉండకపోదన్న అభిప్రాయం వైసిపి హైకమాండ్‌లో ఉందని అంటున్నారు. అందుకనే ఈ జీవి రెడ్డి రాజీనామా తదనంతర పరిణామాలపై వైసిపి ఒక కన్నేసి ఉందనే ఊహాగానాలు బలంగా వినబడుతున్నాయి.
Also Read: విచారణకు ఆదేశిస్తారా? రాజీనామా చేస్తారా? వీసీల వివాదంపై లోకేష్‌కు వైసీపీ సవాల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

