Andhra Pradesh Latest News: విచారణకు ఆదేశిస్తారా? రాజీనామా చేస్తారా? వీసీల వివాదంపై లోకేష్‌కు వైసీపీ సవాల్
Andhra Pradesh Latest News: నారా లోకేష్ వీసీలపై ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించారని వైసీపీ మరోసారి ఆరోపించింది. ఇదిగో ఆధారాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ కంటే మండలిలోనే చర్చలు ఆసక్తిగా మారుతున్నాయి. మంగళవారం ఉదయం యూనివర్శీటల వీసీలపై హీటెక్కించే చర్చ నడిచింది. దీనిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని దాని ఆధారంగా కచ్చితంగా విచారణకు ఆదేశిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. దీనికి స్పందించిన వైసీపీ వీసీ రాసిన లెటర్‌ను బయట పెట్టింది.
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన వైసీపీ రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే వీసీలను బెదిరించి భయపెట్టి రాజీనామా చేయించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీలు. దీని మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
లోకేష్ కామెంట్స్‌పై రియాక్ట్ అయిన వైసీపీ, 19 మంది వీసీల్లో 17 మంది ఒకేసారి రిజైన్ చేస్తే ఏమని అర్థం చేసుకోవాలని వాదించింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని అధికార పక్షంపై ఎదురు దాడి చేసింది. ఇంత మంది ఒక్కసారి రాజీనామా చేస్తే ఏం జరుగుతుందో అని విచారణ చేయాలా వద్దా అని ప్రశ్నించింది. మళ్లీ మంత్రి నారా లోకేష్ లేచి... ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతి అంశానికి విచారణ చేస్తూ వెళ్లలేమని పేర్కొన్నారు. మంత్రులుకానీ, అధికారులు కానీ లేదా ఇంకా ఎవరైనా బెదిరించినట్టు వైసీపీ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. ఒక్క ఆధారం ఉన్నా సరే విచారణకు ఆదేశిస్తామన్నారు. ఈ అంశంపైనే కాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో విచారించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఏదో పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఆరోపణలు చేస్తే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు. అందుకే వారు ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఇంతలో వాళ్లు చేసిన ఆరోపణలను రికార్టుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆరోపణలు చేసేసిన తర్వాత చివరకు తమ సమాధానాలు వినకుండానే వాకౌట్ చేసేస్తున్నారని అన్నారు. అందుకే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు రికార్డుల్లో నుంచి తొలగించాలని అన్నారు. ఈ గందరగోళం మధ్యే సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు ఛైర్మన్.
💣 Truth Bomb 💣
— YSR Congress Party (@YSRCParty) February 25, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో
నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ… pic.twitter.com/9MKjYOtlHL
వాయిదా అనంతరం కూడా వీసీలపై చర్చ జరిగింది. లోకేష్ చెప్పినట్టు తాము ఆధారాలు సమర్పిస్తామని కచ్చితంగా విచారణ జరిపించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. అందుకు లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆధారాలు చూపిస్తే 2019 నుంచి యూనివర్శిటీ వీసల అంశంపై విచారణ చేస్తామన్నారు.
Also Read: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
కట్ చేస్తే వైసీపీ తన సోషల్ మీడియాలో ఇదిగో ఆధారాలు అంటూ ట్రూత్ బాంబ్ పేరుతో ఓ డాక్యుమెంట్ బహిర్గతం చేసింది. విక్రసింహపురి యూనివర్శిటీ వీసీ సుందరవల్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలను చూపిస్తూ లోకేష్‌ను ప్రశ్నించింది. న్యాయ విచారణకు అంగీకరిస్తారా లేకుంటే రాజీనామా చేస్తారా అని సవాల్ చేసింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి లోకేష్‌కు రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.
నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు. దాంతో వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రశ్నించగా.. అడ్డంగా దొరికిపోవడంతో వైస్ ఛాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని మంత్రి నారా లోకేష్ మొదట బుకాయించారు.
కానీ.. వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నాడు. మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు వాస్తవాలు బయటికి వస్తాయా? అని ప్రశ్నిస్తే మౌనమే నారా లోకేష్ సమాధానం అయ్యింది. ఇదిగో ఇప్పుడు నారా లోకేష్ ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నాం.
ఏమాత్రం నిజాయతీ ఉన్నా నారా లోకేష్ ఆ వీసీల రాజీనామాపై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి.. న్యాయం గెలుస్తుంది." అని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేసింది.
Also Read: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

