Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Andhra Pradesh: ఏపీలో ఎన్డీఏ పదిహేనేళ్ల పాటు కలిసి ఉంటుందని పవన్ కల్యాణ్ అసెంబ్లీలో తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి పదిహేనేళ్ల పాటు కలిసి అధికారంలో ఉంటుందని..రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు చూస్తే.. వివేకా హత్య తీరు గుర్తొచ్చిందన్నారు. వైసీపీ తీరు చూస్తుంటే వివేకా హత్య, చట్టాల ఉల్లంఘన, డా.సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తొస్తున్నాయని విమర్శించారు. వైసీపీ తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమన్నారు.
ప్రజలకు మాట ఇస్తున్నాం.. పదిహేనేళ్లు కలిసి ఉంటాం !
ఏపీ ప్రజలకు తాను మాట ఇస్తున్నానని కనీసం పదిహేనేళ్ల పాటు ఎన్డీఏ పాలన ఉంటుందన్నారు. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉంటామన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్న తరుణంలో అసెంబ్లీలో అధికార,ప్రతిపక్షం బాధ్యతలను తామే నిర్వహిస్తామన్నారు. వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు.
గవర్నర్ ను అవమానపరిచిన వారికి అసెంబ్లీలో చోటు లేదు !
గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని, సభలో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తమకు దిశానిర్దేశం చేస్తుంటారని గుర్తుచేసుకున్నారు. కానీ వైసీపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. గవర్నర్ ను వైసీపీ నేతల అవమానించడంలో తమ తప్పేమీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం తరపున వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.వైసీపీ లాంటి పార్టీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు పవన్ హ్యాట్సాప్ చెప్పారు. అసెంబ్లీలో ఎన్డీయే కూటమి సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా ప్రకటించారు.
కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
గవర్నర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన ఆ విధుల్లో ఉన్నప్పుడు కళ్లలోకి చూడగలిగేవారా అని ప్రశ్నించారు. మడ అడవుల విధ్వంసం, అమరావతి రైతుల్ని రక్తం వచ్చినట్లుగా కొట్టడం తరహాలో ఇక్కడా ప్రవర్తిస్తే బయటక కూ డా జరుగుతాయన్నారు. ఇది మారాలి అన చెబితే ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చారని అన్నారు. గవర్నర్ కు గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు. ప్రతిపక్షం అనేది లేదని.. ప్రజలు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలోనూ ఏపీలో తమ కూటమి ప్రభుత్వం ముందంజలో దూసుకుపోతోందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కంటే తమ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

