అన్వేషించండి

Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?

Rahul Gandhi: తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. పార్టీ నేతలకు ఒరోజు క్లాస్ తీసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ స్ఫూర్తిని మిక్స్ చేసి చెప్పాలనుకున్నది చెప్పారు.మరి అది కాంగ్రెస్ నేతలకు అర్థమై ఉంటుందా?

What did Rahul Gandhi say To Congress Leaders:  హైదరాబాద్ శివార్లలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి వేదికగా జరిగిన రెండు రాష్ట్రాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ఒక వినూత్న ప్రయోగానికి వేదికైంది. రాహుల్ గాంధీ తనకు ఇష్టమైన  జియాజిట్సు మార్షల్ ఆర్ట్స్ మెలకువలను రాజకీయాలకు అన్వయిస్తూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి బలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, తక్కువ శక్తితో ఎక్కువ ప్రభావాన్ని చూపడం అనే మార్షల్ ఆర్ట్స్ సూత్రాన్ని రాజకీయాల్లో అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులే పార్టీకి వెన్నుముక అని, వారి నాయకత్వం పటిష్టంగా ఉంటేనే పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం అవుతుందని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఈ సిద్ధాంతపరమైన పాఠాలు క్షేత్రస్థాయిలో ఉన్న అసలు సమస్యలను పరిష్కరించగలవా అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న.

తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వివాదాలు సద్దుమణుగుతాయా? 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ అంతర్గతంగా అనేక అసంతృప్తులు రాజ్యమేలుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియక డజనుకు పైగా ఎమ్మెల్యేలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నైరాశ్యం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తన పర్యటనలో ఇలాంటి కీలకమైన  పవర్ షేరింగ్  అంశాలపై స్పష్టత ఇస్తారని ఆశించిన నేతలకు నిరాశే ఎదురైంది. పార్టీలోని సీనియర్ల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడం కంటే, ఆయన కేవలం శిక్షణ తరగతులకే పరిమితమవ్వడం క్యాడర్‌కు పెద్దగా జోష్ ఇవ్వలేకపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీలో కాంగ్రెస్‌కు రాహుల్ చెప్పిన ప్లానేంటి? 

రాహుల్ పర్యటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం ఊరటనివ్వలేదు. ఏపీలో పార్టీ ఉనికి చాటుకోవడానికి షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఏపీ కాంగ్రెస్‌కు జాతీయ నాయకత్వం నుండి గట్టి భరోసా, స్పష్టమైన రోడ్ మ్యాప్ అవసరం. కానీ, రాహుల్ తన ప్రసంగంలో ఏపీ గురించి కనీసం ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం, షర్మిల చేస్తున్న పోరాటానికి నైతిక మద్దతుగా రెండు మాటలు కూడా మాట్లాడకపోవడం అక్కడి నేతలను విస్మయానికి గురిచేసింది. పొరుగున ఉన్న తెలంగాణలో అధికారం ఉన్నందున, ఏపీకి కావాల్సిన ఆర్థిక, రాజకీయ సహకారం అందుతుందనే భరోసా కూడా లభించలేదు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో సీరియస్‌నెస్  గురించి కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన కొత్త కాన్సెప్టులు, వినూత్న ఆలోచనలు చెబుతున్నప్పటికీ, అవి ఎన్నికల వ్యూహాలుగా ఎలా మారుతాయనే దానిపై నేతలకే క్లారిటీ లేదు. కేవలం సిద్ధాంతాలు చెబితే సరిపోదని, అధికారంలో ఉన్న చోట అసంతృప్తిని చల్లార్చడం, అధికారం లేని చోట ఆశలు కల్పించడం వంటి ప్రాక్టికల్ రాజకీయాలు చేయాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. 

రాహుల్ పర్యటనలో కనిపించని పొలిటికల్ ఎఫెక్ట్ 
 
రాహుల్ గాంధీ పర్యటన  పార్టీలో ఉన్న అంతర్గత పోరు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఏపీలో పార్టీ పునర్వైభవం వంటి అంశాలను గాలికొదిలేసి, మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడటానికే సరిపోయింది.  తెలంగాణలో అధికారం చేతిలో ఉన్నప్పుడే పార్టీని పటిష్టం చేసుకోకపోతే, భవిష్యత్తులో ఇతర శక్తులు పుంజుకునే ప్రమాదం ఉంది. రాహుల్ పర్యటన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో విఫలమవ్వడమే కాకుండా, నేతల మధ్య ఉన్న సందిగ్ధతను మరింత పెంచినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget