ICC Champions Trophy: ఇండియాపై విదేశీ ప్లేయర్ల అక్కసు.. దుబాయ్ లో అన్ని మ్యాచ్ లు ఆడటంపై ప్రశ్నలు.. తాజాగా జాబితాలోకి ఐపీఎల్ స్టార్
భారత్ ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడుతుండటంపై విదేశీ ప్లేయర్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా కమిన్స్.. దుబాయ్ లోనే అన్ని మ్యాచ్ లను ఆడటం భారత్ కి అడ్వాంటేజీ అని తెలిపాడు.

Pat Cummins Comments: వరుస విజయాలతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ కు భారత్ సెమీ ఫైనల్ కు చేరింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 6 ఇకెట్లతో, రెండో మ్యాచ్ లో పాక్ పై ఆరు వికెట్లతో గెలుపొందింది. ఇక సెక్యూరిటీ కారణాలతో పాక్ లో భారత్ పర్యటించకపోవడంతో దుబాయ్ లో మెగాటోర్నీ మ్యాచ్ లు ఆడుతోంది. అయితే భారత్ ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడుతుండటంపై విదేశీ ప్లేయర్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. దుబాయ్ లో అన్ని మ్యాచ్ లను భారత్ ఆడటం వారికి అడ్వాంటేజీ అని వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ అనుకూలత కారణంగా భారత్ కు సానకూలంగా మారిపోయిందని అంటున్నాడు. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న న్యూజిలాండ్ తో వచ్చే ఆదివారం (మార్చి 2న) భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు వార్మప్ మ్యాచ్ లాగే ఉండనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూపులో అగ్రస్థానం సంపాదిస్తుంది. ఇది కొంచె అడ్వాంటేజీ అవనుంది. గ్రూప్-బి టాపర్.. గ్రూప్-ఏ సెకండ్ ప్లేస్ రన్నరప్ తో తలపడనుంది. ఇక తొలి సెమీ ఫైనల్ దుబాయ్ లో మంగళవారం జరుగుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుండటంతో భారత్ ఇక్కడ మ్యాచ్ ఆడుతుంది.
చాలా ఆనందంగా ఉంది..
మెగాటోర్నీకి వ్యక్తిగత కారణాలతోపాటు గాయంతో కమిన్స్ దూరమయ్యాడు. చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గడపటం ఆనందంగా ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు. రీసెంట్ గా తన భార్య రెండో సంతానం, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే చీలమండ గాయంతో కమిన్స్ బాధపడుతున్నాడు. కుటుంబంతో గడపడంతోపాటు రిహాబ్ కూడా బాగా జరుగుతోందని పేర్కొన్నాడు. వచ్చేవారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన జోష్ ఇంగ్లీస్ ను కొనియాడాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ ఉన్న ఇంగ్లీస్.. తనకు దొరికిన అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకున్నాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ కు సిద్ధం..
మెగాటోర్నీ తర్వాత తనకు తీరిక లేని షెడ్యూల్ ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ తోపాటు ఐసీసీ టెస్టు చాంపియన్స షిప్, వెస్టిండీస్ టూర్ ఉన్నాయని, వీటితో బీజీగా గడపనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తీసుకుంటున్న రెస్ట్ తో చిల్ అవడంతోపాటు, రాబోయే బిజీ షెడ్యూల్ కు సిద్ధం కావచ్చని పేర్కొన్నాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్సీ వహిస్తున్న కమిన్స్.. గత సీజన్ లో జట్టును దుర్భేద్యంగా మార్చాడు. టోర్నీలో అత్యధిక స్కోర్లను జట్టు చాలా సార్లు చేసింది. ఇక సీజన్ రన్నరప్ గా నిలిచింది. ఈసారి జట్టు ఇంకా పటిష్టంగా మారడంతో 2016 తర్వాత టీమ్ ను మరోసారి చాంపియన్ గా చేయాలని భావిస్తున్నాడు. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ జరుగనుంది. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ తలపడనుంది. 23న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఆడనుంది.




















