Sachin Vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే గొప్ప.. ఆ ఫార్మాట్లో అతడిని కొట్టేవారు లేరు.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు
కోహ్లీ అన్ని ఫార్మాట్ల ప్లేయర్ అని, అతని ఆటతీరుకు వన్డేలు సరిగ్గా సరిపోతాయని,అతడిని మించిన వారు లేరని అథర్టన్ తెలిపాడు. వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన ప్లేయర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు.

Virat Kohli Records: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ సెంచరీతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (100 నాటౌట్) చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో 51 వసెంచరీ చేసిన ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అలాగే అత్యంత వేగంగా వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్ గా కోహ్లీ రికార్డులకెక్కాడు. కెరీర్ లో 299వ వన్డే ఆడిన కోహ్లీ.. 287వ ఇన్నింగ్స్ లోనే తను 14 వేల రన్స్ ను చేరుకున్నాడు. దీంతో సచిన్ పేరిట ఉన్న అత్యంత వేగవంతంగా 14 వేలు పరుగులు చేసిన రికార్డు (350 ఇన్నింగ్స్) ను భారీ తేడాతో అధిగమించాడు. 63 ఇన్నింగ్స్ ముందుగానే కోహ్లీ ఈ మార్కుకు చేరుకోవడం విశేషం. తాజాగా కోహ్లీ ఘనతలను నిశితంగా పరిశీలించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఫార్మాట్లో అతనే అత్యుత్తమ ఆటగాడని పేర్కొంటున్నారు.
51 సెంచరీలు మాములు కాదు..
కోహ్లీకి ముందు వరకు వన్డేలలో మేటి బ్యాటర్ గా సచిన్ ను పరిగణించేవారని, ఇప్పుడు ఆ స్థానం కచ్చితంగా కోహ్లీకి దక్కుతుందని అథర్టన్ వ్యాఖ్యానించాడు. 51 సెంచరీలు చేయడమంటే మాములు విషయం కాదు. అది కూడా ఛేజింగ్ లో చాలా ఎక్కువ సెంచరీలు (28 శతకాలు) చేయడం గొప్ప విషయమని అంగీకరించాడు. ఈ ఘనతలను చూసుకున్నట్లయితే ఈ ఫార్మాట్లో కోహ్లీనే గొప్ప ప్లేయరని కితాబిచ్చాడు. ఈ విషయంలో నాసిర్ కూడా అతనితో అంగీకరించాడు. ఈ ఫార్మాట్లో సచిన్, కుమార సంగక్కర (శ్రీలంక), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లాంటి ఉత్తమ ప్లేయర్లు ఉన్నప్పటికీ, కోహ్లీకి వారు సాటిరారని పేర్కొన్నారు. కొంతవరకు మాత్రమే వారి ఘనతలు సొంతమని, కోహ్లీ మాత్రం ఎవర్ గ్రీనని వ్యాఖ్యినించారు.
అన్ని ఫార్మాట్ల ప్లేయర్..
ఇక కోహ్లీ అన్ని ఫార్మాట్ల ప్లేయర్ అని, అయితే అతని ఆటతీరుకు వన్డేలు సరిగ్గా సరిపోతాయని, ఈ ఫార్మాట్లో అతడిని మించిన వారు లేరని అథర్టన్ తెలిపాడు. ఈ ఫార్మాట్లో 14 వేల పరుగులు దాటిన ప్లేయర్లు ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. సచిన్ టెండూల్కర్ (18,426), సంగక్కర (14,234), విరాట్ కోహ్లీ (14085) ఉన్నారు. అయితే త్వరలోనే సంగక్కరను అధిగమించి సెకండ్ ప్లేస్ లోకి కోహ్లీ వెళ్లే అవకాశముంది. సంగక్కరను అధిగమించడానికి కోహ్లీకి మరో 150 పరుగుల అవసరం ఉంది. మెగాటోర్నీలో భారత్ కు మరో లీగ్ మ్యాచ్ తోపాటు రెండు నాకౌట్ మ్యాచ్ లు సెమీ ఫైనల్, ఫైనల్ (క్వాలిఫై అయితేనే) మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఫామ్ లో సంగక్కరున ఈ టోర్నీలో కోహ్లీ దాటుతాడని పలువురు విశ్లేషిస్తున్నారు. మార్చి 2న న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ , 4న తొలి సెమీ ఫైనల్, 9న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

