Sankranthiki vasthunnam: ఫ్యాన్స్‌కు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ టీం బిగ్ సర్ ప్రైజ్ - జోష్ పెంచేలా మరిన్ని కామెడీ సీన్స్!, ఓటీటీలోకి ఎప్పుడంటే?
Sankranthiki Vasthunnam OTT Release: విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుండగా.. అదే రోజున ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Venkatesh's Sankranthiki Vasthunnam Deleted Comedy Scenes To Be Added On OTT Version: టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ZEE5' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేయగా.. త్వరలోనే ఓటీటీలోకి ప్రసారం కానుంది. తాజాగా.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నిడివి కారణంగా థియేటర్‌లో కొన్ని సీన్లను డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలిగించారట. తాజాగా.. ఓటీటీ వెర్షన్‌లో డిలీట్ చేసిన ఆ కామెడీ సీన్లను యాడ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పండుగే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఈ మూవీ ఓటీటీలో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ముందుగా టీవీలోకి..
View this post on Instagram
సినిమా థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. అద్భుతమైన రెస్పాన్స్ కారణంగా ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఈ క్రమంలో తొలుత ఓటీటీలోకే వస్తుందని అంతా భావించినా ముందుగా టీవీల్లో ప్రసారం చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. 'జీ తెలుగు'లో మార్చి 1న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానున్నట్లు 'జీ5' తెలిపింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదివారం టీఆర్పీ బాగా వస్తుందని భావిస్తున్నారు. అలాగే, అదే రోజున ఓటీటీలోకి సైతం తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా టీవీలోకి ప్రసారం అయిన తర్వాతే ఓటీటీలోకి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
Also Read: తెలుగులో నిహారిక 'మద్రాస్‌కారన్' - డైరెక్ట్‌గా ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ విక్టరీ వెంకటేస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. వెంకీ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. ఆయన సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 'బుల్లిరాజు'గా ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.
తెలుగులో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ త్వరలోనే బాలీవుడ్‌లోకి సైతం వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మాత దిల్ రాజు హిందీ ప్రేక్షకుల కోసం రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరో అని అనుకుంటున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం చర్చల దశలోనే ఉండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

