Padhe Padhe Song: నయన్ సారికతో సంగీత్ శోభన్ లవ్ సాంగ్... 'రాకాస'లో మెలోడీ రిలీజ్ - లిరికల్ వీడియో చూశారా?
Rakasa Songs Telugu: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన 'రాకాస' నుంచి రెండో పాట విడుదలైంది. 'పదే పదే...' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ మనసుని హత్తుకునేలా ఉంది.

'పదే పదే ప్రాణం నిన్నే కోరగా...
కలే నిజం కాదా నిన్ను చేరగా...
ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా...
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ' అంటూ నయన్ సారిక పాడుతున్నారు. అదీ సంగీత్ శోభన్ కోసం. ఆయన మీద మనసు పారేసుకున్నారు ఆవిడ. రియల్ లైఫ్‌లో కాదులెండి... రీల్ లైఫ్‌లో! వాళ్లిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'రాకాస'. అందులోని మెలోడీ సాంగ్ 'పదే పదే...'ను లేటెస్టుగా రిలీజ్ చేశారు.
అబ్బాయికి ప్రేమ సంగతి చెప్పలేక?
తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురు చూసే ఓ అమ్మాయి ఫీలింగ్ 'పదే పదే...'లో చూపించారు. వాళ్ళిద్దరి కథ ఏమిటో ఏప్రిల్ 3న వెండితెరపై చూడాలి. ఆ రోజు సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న 'రాకాస' సినిమాను నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నారు.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
'పదే పదే...' పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాటను సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు.
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న 'రాకాస' సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్ - పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిర్మాతలు: నిహారిక కొణిదెల - ఉమేష్ కుమార్ బన్సాల్, కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - దర్శకత్వం: మానస శర్మ.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
ట్రెండింగ్ వార్తలు




















