NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న 'ఎన్టీఆర్‌నీల్' ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. మూవీ కథ ఇదేనంటూ ఓ రిపోర్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

NTRNeel Project Story Leaked: టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. మార్చి నుంచి ఎన్టీఆర్ షూట్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 'ఎన్టీఆర్‌నీల్' (NTRNeel) వర్కింగ్ టైటిల్‌తో ముస్తాబవుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నారు. వచ్చే ఏడాదికి రాబోయే ఈ మూవీపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా.. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ రిపోర్ట్ వైరల్ అవుతోంది.
అసలు కథ ఇదేనా..?
ఆ రిపోర్ట్ ప్రకారం.. థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని పాలించే ప్రసిద్ధ చైనీస్ గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ 'జావో వీ' నిజ జీవిత పాత్ర నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రోల్ విషయానికొస్తే.. ఆయన మాఫియా డాన్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం. దిగువ స్థాయి నుంచి ఎదిగి ఇద్దరు గ్యాంగ్ స్టర్స్‌తో పోరాడి తన సొంత పాలనను ఎదిగి తిరుగులేని నాయకుడిగా అవతరిస్తారని తెలుస్తోంది. అయితే, ఇది పూర్తిగా ప్రచారం మాత్రమే. అధికారికంగా కథపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇటీవలే షూటింగ్ ప్రారంభం
'ఎన్టీఆర్‌నీల్' (NTRNeel) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి మొదలైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో భాగంగా దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ పెద్దల టాక్. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఫోటోను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆర్ఎఫ్‍సీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో ఓ స్పెషల్ సెట్ సిద్ధం చేసి అక్కడ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించనున్నారు. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయనకు తొలి బాలీవుడ్ మూవీ కాగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అనంతరం 'దేవర 2' కూడా చేయాల్సి ఉండగా.. షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పనులు పూర్తైన తర్వాతే దేవర 2 సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, 'ఎన్టీఆర్‌నీల్' ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ 10 రోజులు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.






















