అన్వేషించండి

Dasaswamedh Ghat: పవిత్ర గంగా హారతికి పుట్టినిల్లు , శివుడిని స్వాగతించేందుకు బ్రహ్మ సృష్టించిన ఘాట్ దశాశ్వమేధ ఘాట్!

Maha Shivratri 2025: కాశీలో ప్రతి ఘాట్ ప్రత్యేకమే..పవిత్ర గంగా హారతికి పుట్టినిల్లు , శివుడిని స్వాగతించేందుకు బ్రహ్మ సృష్టించినది ఘాట్ దశాశ్వమేధ ఘాట్. మహా శివరాత్రి సందర్భంగా ఈ ఘాట్ గురించి మీకోసం

Dasaswamedh Ghat in Varanasi:  కాశీ నగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ప్రధానంగా మూడు. ఒకటి కాశీ విశ్వనాథ మందిరం, రెండు గంగా నది మూడోది పవిత్ర గంగా మాతకిచ్చే హారతి. కాశీ వెళ్లిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గంగా హారతిని కళ్ళారా చూసి రావాలనే అనుకుంటారు. అంతటి పవిత్రమైన గంగా హారతి జరిగే ప్రధానమైన స్థలమే దశ - అశ్వమేధ ఘాట్.

ఫిబ్రవరి 26 మహ శివరాత్రి...ఈ సందర్భంగా  ఈ ఘాట్ గురించి ప్రత్యేక కథనం...

 బ్రహ్మ పది యాగాలు చేసిన స్థలం ఇది 

కాశీ విశ్వనాథ మందిరానికి అతి దగ్గరగా ఉండే ఈ ఘాట్ వద్ద  పూర్వకాలంలో సృష్టి కర్త బ్రహ్మ  పది అశ్వమేధ యాగాలు చేశాడని అందుకే దీనికి దశ -అశ్వమేథ ఘట్ అనే పేరు వచ్చిందని చెబుతారు. మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుడు పరమశివుడ్ని భూమికి ఆహ్వానించిన ప్రాంతంగా కూడా దశాశ్వమేధ ఘాట్ ప్రసిద్ధి చెందింది. కాశీలోని ఘాట్ లు అన్నిట్లో  చాలా పవిత్రమైంది గా దీనికి పేరు. పురాతన ఘాట్ పాడైపోవడంతో 1748లో మరాఠా పేశ్వా బాలాజీ బాజీరావు ఈ ఘాట్ ను నిర్మించారు. మరో 30 ఏళ్ల తర్వాత  ఇండోర్ మహారాణి అహల్య బాయి ఈ ఘాట్ ను అభివృద్ధి చేశారు.

Also Read: కాశీలో మహాశివరాత్రి సందడి - గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ విశిష్టత ఇదే!

దశాశ్వమేధ ఘాట్  ప్రత్యేకం : గంగా హారతి 

ఈ ఘాట్ ప్రత్యేకం ముందే చెప్పుకున్నట్టు గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో  పూజారులు రకరకాల దీపాలతో లయబద్ధంగా గంగానదికి ఇచ్చే హారతి ఎంతో పాపులర్. ఈ హారతిని కళ్ళారా చూడడం ఎంతో పుణ్యం అని  భక్తులు భావిస్తుంటారు. గంగా నదిలో పడవ పై ఏర్పాటుచేసిన కుర్చీలలో కూర్చుని ఈ గంగా హారతిని చూడడం కోసం  టూరిస్టులు పోటీ పడుతుంటారు. సప్త ఋషులకు  ప్రతీక గా ఏడుగురు యువకులు గంగా హారతి ఇస్తారు. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ఆటో రిక్షాలో  30 రూపాయల రుసుముతో  ఈ ఘాట్ వద్దకు సులువుగా చేరుకోవచ్చు. 

Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!

తీవ్రవాదుల బాంబు దాడికి చెక్కు చెదరని  వారణాసి

2010లో  దశ అశ్వమేధ ఘాటు వద్ద తీవ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు విదేశీ టూరిస్టులు. గంగా హారతిస్తున్న  చివరి నిముషాల్లో ఈ దాడి జరిగింది ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ. అయినప్పటికీ కాశీవాసుల ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగా హారతి ని చూడడానికి భక్తులు పర్యాటకులు సాయంత్రం అయ్యేసరికి పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుంటారు.

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget