అన్వేషించండి

Citadel Honey Bunny Review - సిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

OTT Review - Citadel Honey Bunny Web Series: సమంత ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Samantha's Citadel Honey Bunny Review In Telugu: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఆమె నటించిన సిరీస్ ఇది. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ది ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్లు, ఫర్జి తర్వాత రాజ్ అండ్ డీకే  దర్శక ద్వయం తెరకెక్కించిన సిరీస్ కావడం... ప్రియాంకా చోప్రా 'సిటాడెల్' యూనివర్స్ సిరీస్ కావడంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉంది? సామ్, వరుణ్ ఎలా చేశారు? రాజ్ అండ్ డీకే ఎలా తీశారు? అనేది రివ్యూలో చూడండి.

కథ (Citadel Honey Bunny Story): బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. ఓ సినిమా షూటింగ్ చేసేటప్పుడు హనీ (సమంత) పరిచయం అవుతుంది. ఆమె ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న ఔత్సాహిక నటి. రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో బన్నీ చెప్పినట్టు ఓ కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత బన్నీ ఏజెంట్ అని ఆమెకు తెలుస్తుంది. ఆ తర్వాత హనీ కూడా ఏజెంట్ అవుతుంది.

బాబా (కేకే మీనన్) ఏజెన్సీలో బన్నీ, హానీ ఏజెంట్లు. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఒక్కటి అవుతారు. బాబా ఆదేశాల మేరకు డాక్టర్ రఘు (తలైవాసల్ విజయ్)ను బన్నీ చంపేస్తాడు. ఆ తదనంతర పరిస్థితుల్లో ఆమె మరణించిందని బన్నీ అనుకుంటాడు. అయితే... ఎనిమిదేళ్ల తర్వాత హానీ బతికే ఉందని, తన ద్వారా నాడియా (కష్వీ మజుందార్)కు జన్మనిచ్చిందని తెలుసుకుంటాడు. 

హనీ కోసం బాబా మనుషులు ఒక వైపు, 'సిటాడెల్' ఏజెంట్లు మరో వైపు వెతుకుతారు. రఘును బాబా ఎందుకు చంపమన్నాడు? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకంత వెతుకుతున్నారు? జూనీ (సిమ్రాన్) ఎవరు? బాబాను విశ్వ అని, గుర్తు అని జూనీ ఎందుకు అంటుంది? హనీ, తన కుమార్తెను కాపాడుకోవడం కోసం బన్నీ అలియాస్ రాహీ గంబీర్ ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Citadel: Honey Bunny Review Telugu): ఓటీటీ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులు రాజ్ అండ్ డీకే. థ్రిల్ మూమెంట్స్ ఇవ్వడంతో పాటు ఇండియన్స్ కోరుకునే ఫ్యామిలీ బాండింగ్ - ఎమోషనల్ టచ్ ఇచ్చి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జి' తీసి విజయాలు అందుకున్నారు. 'గన్స్ అండ్ గులాబ్స్'కూ రెస్పాన్స్ బావుంది. కానీ, 'సిటాడెల్'కు వచ్చేసరికి రాజ్ అండ్ డీకే మార్క్ టచ్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.

ప్రియాంకా చోప్రా 'సిటాడెల్' చూసిన జనాలకు ఈ 'సిటాడెల్: హనీ బన్నీ' మీద కొన్ని అంచనాలు ఉంటాయి. అన్నట్టు... ఆ 'సిటాడెల్'కు ఇది రీమేక్ కాదు. ఆ యూనివర్స్‌లో పార్ట్ అంతే! నెక్స్ట్... అందులో ఉన్నట్టు ఇందులో రొమాంటిక్ / హాట్ సీన్లు లేవు. యాక్షన్, థ్రిల్లింగ్ సీన్లు సైతం ఆ స్థాయిలో లేవు. స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఆడియన్స్ భారీ ఛేజ్, యాక్షన్ సీక్వెన్సులతో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆశిస్తారు. 'సిటాడెల్: హనీ బన్నీ' స్టార్టింగ్ ఎపిసోడ్‌లో అటువంటి బైక్ ఛేజ్ ఒకటి ఉంటుంది. అయితే... ఆ తర్వాత నో థ్రిల్, నో యాక్షన్ అన్నట్లు సాగదీత సన్నివేశాలతో ముందుకు వెళుతుంది. 'సిటాడెల్: హనీ బన్నీ'కి మెయిన్ మైనస్... స్క్రీన్ ప్లే. సిరీస్ కథ 1992లో, 2000లో జరుగుతుంది. ముందు నుంచి వెనక్కి, వెనుక నుంచి ముందుకు వెళుతుంది.

వీక్షకుడిని డిస్టర్బ్ చేయనంత వరకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అసలు సమస్య ఉండదు. వాళ్ళను సర్‌ప్రైజ్ చేసేలా ఉంటే మరింత బావుంటుంది. ఉదాహరణకు... విజయ్ సేతుపతి 'మహారాజా'. అందులో స్క్రీన్ ప్లే / ట్విస్ట్ రివీల్ అయ్యాక ఆడియన్స్ షాక్ ఫీల్ అవుతారు. దర్శకుడు భలే మేజిక్ చేశాడని అనుకుంటారు. '96' (తెలుగులో శర్వానంద్, సమంత 'జాను')కు వస్తే... ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ప్రజెంట్ సీన్లకు ఓ కనెక్షన్ ఉంటుంది. అటువంటి షాక్ ఫ్యాక్టర్ గానీ, ఫీల్ గానీ ఇవ్వడంలో 'సిటాడెల్: హనీ బన్నీ' ఫెయిల్ అయ్యింది. సింక్ లేకుండా స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కి వెళుతుంది. అది కన్‌ఫ్యూజ్ చేయడమే కాదు... ఒక దశలో ఎందుకు ముందుకు వెనక్కి వెళుతున్నారో అర్థం కాకుండా గందరగోళానికి గురి చేస్తుంది.

'సిటాడెల్: హనీ బన్నీ'లో ట్విస్టులు ఊహించడం కష్టం ఏమీ కాదు. హనీతో బన్నీ ప్రేమలో పడిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో తెలుస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ సింపుల్ అండ్ నార్మల్ అనిపిస్తుంది. క్లిప్ హ్యాంగర్ వంటివి ఏమీ లేవు. పైన చెప్పినట్టు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సీక్వెన్సులు లేవు. స్పై థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలని రూల్ ఏమీ లేదు. కానీ, ఓ సస్పెన్స్ అనేది మైంటైన్ చేయాలి కదా! నెక్స్ట్ ఏం జరుగుతుందోననే థ్రిల్ ఇవ్వాలి కదా! అటువంటిదీ ఏమీ లేదు. స్క్రీన్ మీద సన్నివేశాలు వెళుతున్నా ప్రేక్షకుల మదిలో చలనం ఉండదు. సాధారణ ఇండియన్ ఫ్యామిలీ డ్రామా సాగుతున్నట్టు ఉంటుంది.

స్పై థిల్లర్స్ ప్రధాన లక్షణాల్లో... వీక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలిగించడంతో పాటు పాత్రలతో ప్రయాణించేలా చేయడం! హానీ, బన్నీ ప్రేమలో పడటం దగ్గర్నుంచి మిషన్ కోసం ఫైట్ చేయడం, ఇద్దరి మధ్య దూరం పెరగడం వంటివి ఆసక్తిగా అనిపించలేదు. పాపను కాపాడుకోవడం కోసం మళ్లీ దగ్గర కావడం, ఫైట్ చేయడంలో కాస్త ఎమోషన్ ఉంది. బాబా అలియాస్ విశ్వ అలియాస్ గురు గానీ, జూనీ గానీ ఎందుకు అర్మాడా కోసం అంత కష్టపడతారు? అనేది క్లారిటీ ఉండదు. నెక్స్ట్ సీజన్ కోసం అన్నట్టు దాచేశారు. యాక్షన్ పార్ట్ తక్కువే. అందులో కాస్త రూసో బ్రదర్స్ స్టైల్ కనిపించింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. అమన్ పంత్ రీ రికార్డింగ్ నోటీస్ చేసేంతలా లేదు.

Also Read: 'సింగం ఎగైన్' రివ్యూ: రోహిత్ శెట్టి రామాయణం... పోలీస్ ఫ్రాంఛైజీలో కుదిరిందా? లేదంటే ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టిందా?


వరుణ్ ధావన్, సమంత నుంచి రాజ్ అండ్ డీకే మంచి పెర్ఫార్మన్స్ చేయించారు. హిందీ సినిమాల్లో 1990లలో స్టంట్ మ్యాన్ సన్నివేశాలు చేసినప్పుడు గోవిందా తరహాలో కనిపించారు వరుణ్. జూనియర్ ఆర్టిస్ట్ సన్నివేశాల కంటే ఏజెంట్ / మదర్ సీన్స్ చేసినప్పుడు సమంతలో మెచ్యూరిటీ కనిపించింది. ఫైట్స్ కోసం ఆమె పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. సమంత, వరుణ్ మధ్య సన్నివేశాల్లో / యాక్షన్ సీక్వెన్సుల్లో కెమిస్ట్రీ బావుంది. బాబాగా కేకే మీనన్ నటన కూడా. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్ర చేశారు. సమంత కుమార్తెగా నటించిన 'బేబీ' కష్వీ మజుందార్ నటన ముద్దు ముద్దుగా ఉంది. ఆ చిన్నారి చెప్పే డైలాగులు భలే ఉన్నాయి. రుద్ర ప్రతాప్ పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో యష్ పూరి, రఘు పాత్రలో తలైవాసల్ విజయ్ కనిపించారు. 

తెలుగు రాజ వంశానికి చెందిన అమ్మాయి / యువరాణిగా సమంత కనిపించడం... రాజ భవంతిలోని సన్నివేశంలో వరుసగా తెలుగు డైలాగులు చెప్పడం టాలీవుడ్ ఫ్యాన్స్ / ఆడియన్స్ అందరికీ సర్‌ప్రైజ్. ఆ సీన్ నచ్చుతుంది కూడా!

'సిటాడెల్: హనీ బన్నీ'... స్టైలిష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ సిరీస్. ఇందులో థ్రిల్ అండ్ యాక్షన్ తక్కువ... లెంగ్తీ సీన్స్ / ఎపిసోడ్స్ ఎక్కువ. ఆడియన్స్‌కు కన్‌ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ మైనస్. ఈ సిరీస్ చూడాలంటే ఓపిక అవసరం. వరుణ్ ధావన్, మరీ ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయితే తప్ప ఆల్మోస్ట్ ఐదు గంటల సిరీస్ చూడలేరు. ఏ మాటకు ఆ మాట... వాళ్లిద్దరి నటన అభిమానులకు నచ్చుతుంది. ప్రియాంకా చోప్రా 'సిటాడెల్' చూస్తే... అందులో నాడియా రోల్ బ్యాక్ స్టోరీ కనుక కొంత ఆసక్తిగా అనిపిస్తుంది. 'సిటాడెల్: డయానా'లో విలన్ కూడా ఇందులో కనిపిస్తారు. అది ఎక్కడ అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

Also Readఅమరన్ రివ్యూ: నటనతో ఏడిపించిన సాయి పల్లవి... ఆర్మీ అధికారిగా శివకార్తికేయన్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget