అన్వేషించండి

Food Poison: రాగి జావ తాగిన విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌.. కోనసీమ జిల్లాలో ఘ‌ట‌న‌..

Andhra Pradesh News | రాగిజావ తాగిన 14 మంది విద్యార్ధులు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గ‌రాజుపేట ఎంపీపీ స్కూల్‌లో జ‌రిగింది.

Food Poison in Konaseema District | ఉప్పలగుప్తం: పాఠ‌శాల‌లో  రాగి జావ తాగిన 14 మంది విద్యార్ధుల‌కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు.. వారిని హుటాహుటీన ఆసుప్ర‌తికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు.. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం జగ్గ‌రాజు పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థిని విద్యార్థులు రాగిజావ త్రాగి అస్వస్థతకు గురవడం స్థానికంగా క‌ల‌క‌లం రేగింది. దీంతో విద్యార్థుల త‌ల్లితండ్రులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.. అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం అమ‌లాపురంలోని ఏరియా ఆసుప్ర‌తికి త‌ర‌లించి వైద్య‌సేవ‌లందించారు. 

అస‌లేం జ‌రిగిందంటే...

స్కూల్‌ కుక్‌ కమ్ హెల్పర్ ఇంట్లో శుభకార్యం ఉండ‌డం వ‌ల్ల‌ మంగళవారం ఉదయమే రాగిజావను ఇంటి వద్ద తయారుచేసి పాఠశా లలకు  తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ రాగి జావ‌ను  ఉదయం 10:30 సమయంలో విద్యార్థులకు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అయితే రాగిజావ తాగిన విద్యార్థులు కాసేప‌టికి వాంతులు చేసుకున్న‌ట్లు చెప్పారు. క‌డుపులో వికారంగా ఉంద‌ని అంద‌రు విద్యార్థులు చెప్ప‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఉపాధ్యాయులు వెంట‌నే ఎన్‌.యానాం పీహెచ్‌సీకు స‌మాచారం అందించి హుటాహుటీన ఆసుప్ర‌తికి త‌ర‌లించారు.  అప్ప‌టికే రాగిజావ తాగిన  14 మంది అస్వస్థతకు గురికాగా వారికి అత్య‌వ‌స‌ర చికిత్స అందించారు. 

మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆసుప్ర‌తికి..
 
ఎస్ యానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించి తదుపరి మెరుగైన వైద్య సేవలు అందించు నిమిత్తం ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అమ లాపురం ఏరియా  ఆసుపత్రికి 108 అంబులెన్స్‌ల్లో  త‌ర‌లించారు.  వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు  ఏడుగురు పరిస్థితి బాగానే ఉందని,  మరో ఏడుగురు పరిస్థితి కూడా మంగళ వారం సాయంత్రానికి నిలకడగా ఉందని వైద్యులు తెలిపార‌ని   జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష తెలిపారు. విద్యార్థ‌లు ఆరోగ్య ప‌రిస్థ‌తి బాగానే ఉండ‌డంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు.. 

కుక్ కం హెల్పర్ ను విధుల నుంచి తొలగింపు

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో రాగి జావ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుందని భావిస్తున్న‌ట్లు డీఈఓ తెలిపారు. ఇదే విష‌యాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే కుక్ కం హెల్పర్ ను విధుల నుండి తొలగించాలని డీఈవో ని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ మేరకు కుక్‌ కం హెల్పర్ ను విధుల నుండి తొలగించడం జరిగిందని డీఈఓ ఆ ప్రకటనలో  తెలిపారు. అస్వ‌స్థ‌త‌కు గురైన విద్యార్థుల‌ను అమ‌లాపురం ఎమ్మెల్యే అయితా బ‌త్తుల ఆనంద‌రావు, అమ‌లాపురం ఆర్డీవో కె.మాధ‌వి త‌దిత‌ర అధికారులు ప‌రామ‌ర్శించి విద్యార్థ‌లు త్వ‌ర‌గా కోలుకునేలా మెరుగైన వైద్య‌సేవ‌లందించాల‌ని ఆదేశించారు.. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget