Axar Vs Rohit: అక్షర్ పటేల్ కు నష్ట పరిహారం చెల్లించనున్న రోహిత్.. కోహ్లీ సెంచరీపై అక్షర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కోహ్లీ చివరకు సెంచరీ చేసేందుకు అవసరమైన లెక్కలన్నీ మైండ్ లో చేసుకున్నట్లు అక్షర్ పేర్కొన్నాడు.ఎలాగైనా కోహ్లీ సెంచరీ సాధించాలని భావించానని, అందుకోసం తగిన కసరత్తు చేసినట్లు పేర్కొన్నాడు.

ICC Champions Trophy 2025 Latest Updates: గతవారం బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ త్రుటిలో హ్యాట్రిక్ మిస్సయ్యిన సంగతి తెలిసిందే. తొలి రెండు బంతులకు తంజిద్ హసన్, ముష్ఫికుర్ రహీమ్ లను ఔట్ చేసిన అక్షర్..మూడో బంతిని వేయగా తౌహిద్ హృదయ్ బ్యాట్ ను ముద్దాడుతూ.. స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ వైపు వెళ్లింది. అయితే దాన్ని జారవిడవడంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. దీంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత ప్లేయర్ గా నిలిచేవాడు. అయితే ఓవరాల్ గా జేరోమ్ టేలర్ (వెస్టిండీస్) మాత్రమే ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో హ్యాట్రిక్ సాధించాడు. ఇక తన కారణంగా హ్యాట్రిక్ మిస్సవడంతో చాలా ఫీలయ్యిన రోహిత్.. గ్రౌండ్ పై తన కుడి చేతిని బాదుతూ కనిపించాడు. ఇక ఆ మ్యాచ్ లో తౌహిద్ సెంచరీతో సత్తా చాటాడు. బంగ్లా విధించిన 228 పరుగుల టార్గెట్ ను భారత్ ఈజీగా చేజ్ చేసింది. ఆ తర్వాత పాక్ పై గెలిచి కూడా సెమీస్ కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ తన కారణంగా మిస్సయ్యినందుకు అక్షర్ కు నష్ట పరిహారం చెల్లించడానికి రోహిత్ సిద్ధమయ్యాడు. అది ఈ వారంలోనే నెరవేరే అవకాశముంది.
వారం రోజుల బ్రేక్..
ఆదివారం పాక్ తో మ్యాచ్ ముగిశాక తర్వాతి మ్యాచ్ మళ్లీ వచ్చే ఆదివారం ఉంది. దీంతో వారం రోజుల పాటు టీమిండియాకు బ్రేక్ లభించింది. బంగ్లాపై కివీస్ గెలవడంతో ఇప్పటికే భారత్, కివీస్ సెమీస్ కు దూసుకెళ్లాయి. వచ్చేవారం ఇరుజట్ల మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ అప్రధాన్యంగా మారిపోయింది. అయిత్ గ్రూప్ విజేత ఎవరో తేలేందుకు మాత్రం ఈ మ్యాచ్ ఉపకరించనుంది. ఇక రోహిత్ నష్టపరిహారంగా తనను డిన్నర్ కి తీసుకెళతానని చెప్పినట్లు అక్షర్ పేర్కొన్నాడు. కివీస్ తో మ్యాచ్ కు లభించిన బ్రేక్ టైంలో రోహిత్ తన హామీని నెరవేర్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కోహ్లీ సెంచరీ కోసం ఆరాట పడ్డా..
వన్డేల్లో దాయాదుల పోరును తొలిసారి డ్రెస్సింగ్ రూం నుంచి చూసినట్లుగా పేర్కొన్న అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీ చివరకు సెంచరీ చేసేందుకు అవసరమైన లెక్కలన్నీ తన మైండ్ లో చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఎలాగైనా కోహ్లీ సెంచరీ సాధించాలని భావించానని, అందుకోసం తగిన కసరత్తు చేసినట్లు పేర్కొన్నాడు. బ్యాట్ ఎడ్జ్ తాకి బౌండరీకి వెళ్ల కూడదని కోరుకున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ మ్యాచ్ లో కచ్చితమైన త్రోతో ఇమాముల్ హక్ ను రనౌట్ చేసిన అక్షర్ కు ఉత్తమ ఫీల్డర్ మెడల్ ను టీమ్ బహుకరించింది. దీన్ని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ .. అక్షర్ కు బహుకరించాడు. టోర్నీలో జట్టు బాగా ఆడుతోందని, తన చేత ఈ బహుమానం అందించడం గౌరవంగా బావిస్తున్నట్లు ధావన్ పేర్కొన్నాడు.
Read Also: AUS vs SA: ఆస్ట్రేలియాVs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు- గ్రూప్ Bలో సెమీస్‌కు వెళ్లేది ఎవరు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

