AUS vs SA: ఆస్ట్రేలియాVs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు- గ్రూప్ Bలో సెమీస్‌కు వెళ్లేది ఎవరు?
AUS vs SA: రావల్పిండిలో జరగాల్సిన ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది. ఇప్పుడు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌కి కూడా సెమీ-ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు పెంచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఏడో మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రావల్పిండిలో జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యింది. ఆడే వాతావరణం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు టాస్ వేయడానికి కూడా బయటకు రాలేదు. సమ ఉజ్జీల పోరులో కచ్చితంగా పరుగుల వరద ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వరుణుడే వరద పారించాడు. డ్రా కారణంగా రెండు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గ్రూప్ బిలో సెమీఫైనల్స్ పోరు ఆసక్తిగా మారింది.
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ చాలా కీలకం
గ్రూబ్ బీలో ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్స్‌కు దాదాపుగా చేరుకునేది. కానీ మ్యాచ్ జరగలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై ఇంకా బెర్త్‌లు ఆధారపడి ఉన్నాయి. సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవడానికి ఈ రెండు జట్లకు కూడా అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ Bలో సెమీఫైనల్స్ కోసం రేసులో ఇప్పుడు నాలుగు జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఒక్కొక్క మ్యాచ్ గెలిచాయి. ఇప్పుడు మ్యాచ్ రద్దు అయింది. దీంతో రెండు జట్లకు మూడేసి పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్ కారణంగా ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంటే... కంగారూ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంకా ఆస్ట్రేలియాకు ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలి. ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే 5 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించినా సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది, కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.
ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు ఓడిపోతే, అది టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతే సంకీర్ణాలు మరింత క్లిష్టమవుతాయి. అప్పుడు దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌పై ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా కోరుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా, ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కేవలం 2 పాయింట్లకే పరిమితం అవుతాయి. గ్రూప్ A లో అయితే ఫైనల్ 4కు భారత్, న్యూజిలాండ్ చేరుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంటిమొహం పట్టాయి.
మరోవైపు రావల్పిండిలో వర్షం పడే టైంలో నిర్వాహకులు తీసుకున్న చర్యలపై సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లపై స్పందించిన ఇండియన్ మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ పీసీబీపై విమర్శలు గుప్పించాడు. మైదానాన్ని సరిగ్గా కవర్ చేయకపోవడం బాధాకరం అని అన్నారు. చాలా ముఖ్యమైన మ్యాచ్. దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా. ఈ సమస్యపై ఎవరూ దృష్టి పెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆతిథ్య జట్టు ఐసిసి డబ్బును తెలివిగా యూజ్ చేశారని? అనుమానం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు కావడానికి ముందే మహ్మద్ కైఫ్ ఈ విమర్సలను చేశారు. దీంతో అతని అంచనా నిజమైంది. ఆయన ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజుల్లో ప్రపంచంలోని అన్ని మైదానాలు వర్షం వచ్చినప్పుడు మొత్తాన్ని కపేస్తున్నారు. కానీ రావల్పిండిలో ఇది జరగలేదు. కైఫ్ తన పోస్ట్‌లో మైదానం ఫోటోను కూడా షేర్ చేశారు.
Also Read: సచిన్ కంటే కోహ్లీనే గొప్ప.. ఆ ఫార్మాట్లో అతడిని కొట్టేవారు లేరు.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు




















