WPL Table Topper DC: టాప్ లేపిన ఢిల్లీ.. గుజరాత్ పై అలవోక విజయం.. జొనసెన్ మెరుపు ఫిఫ్టీ
Dc Vs GG Result Update: జెస్ జొనసెన్ ఆల్ రౌండ్ షో (32 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు, 1-24)తో అదరగొట్టింది. దీంతో మరో 29 బంతులు ఉండగానే అలవోక విజయాన్ని ఢిల్లీ సొంతం చేసుకుంది.

Wpl DC Vs GG Result Live Updates: డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. రెండుసార్లు రన్నరప్ ఢిల్లీ.. తాజాగా టేబుల్ టాపర్ గా నిలిచింది. మంగళవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ఆరు వికెట్లతో సునాయాస విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. జట్టులో భారతి ఫుల్ మాలి (29 బంతుల్లో 40 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనధాన్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో శిఖా పాండే, మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
ఛేదనను 15.1ఓవర్లలో నాలుగు వికెట్లకు 131 పరుగులు చేసి విజయం సాధించింది. జెస్ జొనసెన్ ఆల్ రౌండ్ షో (32 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు, 1-24)తో అదరగొట్టింది. దీంతో మరో 29 బంతులు ఉండగానే అలవోక విజయాన్ని ఢిల్లీ సొంతం చేసుకుంది. దీంతో మూడు విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. జొనసెన్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బుధవారం జరగబోయే మ్యాచ్ లో యూపీతో ముంబై తలపడనుంది.
Clinical with the bat 🤝 Effective with the ball
— Women's Premier League (WPL) (@wplt20) February 25, 2025
Jess Jonassen is the Player of the Match for her superb all-round show! 🫡
Scorecard ▶️ https://t.co/lb33BTx583#TATAWPL | #DCvGG | @DelhiCapitals | @JJonassen21 pic.twitter.com/x1z1b32YWr
మూకుమ్ముడిగా విఫలం..
ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ .. తొందరగానే పీకల్లతో కష్టాల్లో కూరుకుపోయింది. హర్లీన్ డియోల్ (5), కెప్టెన్ యాష్లీ గార్డెనర్ (3), ఫక్షబ్ లిచ్ ఫిల్డ్ , కశ్వీ గౌతమ్ డకౌట్లుగా వెనుదరిగడంతో ఒక దశలో 60-6తో దయనీయమైన స్థితిఓలో నిలిచింది. మధ్యలో డియేంద్ర డాటిన్ (26) కాస్త పోరాడినా, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. ఈ దశలో భారతి, తనుజా కన్వర్ (16) జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్ కు 51 పరుగులు జోడించడంతో గుజరాత్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. అలాగే ఎక్స్ట్రాల రూపంలో మరో 21 పరుగులు కూడా రావడం గుజరాత్ కు ప్లస్ పాయింట్ గా మారింది. మిగతా బౌలర్లలో టిటాస్ సాధుకు ఒక వికెట్ దక్కింది.
సూపర్ భాగస్వామ్యం..
ఛేజింగ్ లో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (3) విఫలమైంది. ఈ దశలో షెఫాలీ వర్మ (27 బంతుల్లో 44, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి జొనసెన్ జట్టును ముందుకు నడిపించింది. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఓ ఆటాడుకోవడంతో స్కోరు బోర్డు చెకచెకా కదిలింది. వేగంగా ఆడిన ఫెషాలీ ఔటవడంతో రెండో వికెట్ కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మధ్యలో మిడిలార్డర్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ (5), అన్నాబెల్ సదర్లాండ్ (1) త్వరగానే ఔటైనా మారిజాన్ (9 నాటౌట్) తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈక్రమంలో కేవలం 26 బంతుల్లోనే జొనసెన్ ఫిఫ్టీ పూర్తి చేసింది. మిగతా బౌలర్లలో కశ్వీ గౌతంకి రెండు, గార్డెనర్, తనుజాకు ఒక వికెట్ దక్కింది.




















