Makeup Tips : గ్లోయింగ్ మేకప్ లుక్ కావాలంటే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి.. సమ్మర్లో ఇలా ట్రై చేయండి
Pre-Makeup Rituals : సమ్మర్లో మేకప్ వేసుకుంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే కొన్ని స్కిన్ కేర్ టిప్స్‌ని ఫాలో అయ్యి.. మేకప్ వేసుకోవాలంటున్నారు నిపుణులు.

Makeup Hacks in Summer : మేకప్ వేసుకునేవారి సంఖ్య ఈ మధ్య ఎక్కువ అవుతుంది. నలుగురిలో తాము అందంగా కనిపించాలని కోరుకుంటూ ఆడవారి నుంచి మగవారు కూడా ఈ మేకప్ వేసుకుంటున్నారు. అయితే మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యం అనుకుంటున్నారో దానికి తగిన స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. స్కిన్ బాగుంటే మేకప్ రిఫ్లెక్షన్ కూడా బాగుంటుందని చెప్తున్నారు.
సమ్మర్లో మేకప్ వేసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా స్కిన్‌కి కావాల్సిన పోషణ అందించి.. ఆ తర్వాత మేకప్ వేసుకోవాలంటున్నారు. అప్పుడే స్కిన్ మరింత హెల్తీగా, గ్లోయింగ్‌గా కనిపిస్తుందని చెప్తున్నారు. స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంచడంలో ఏవి హెల్ప్ చేస్తాయో.. మేకప్‌కి ముందు కచ్చితంగా వాటిని ఎందుకు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం.
ఎక్స్ఫోలియేట్..
ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల స్కిన్ మృదువుగా మారుతుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. దీనివల్ల చర్మం తాజాగా, మెరిసేలా కనిపిస్తుంది. AHA లేదా BHA ఎక్స్ఫోలియేటర్లు బెస్ట్. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇవి మంచి ఎంపిక అవుతాయి. వారానికి దీనిని రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
క్లెన్సింగ్
ముందుగా చర్మాన్ని శుభ్రం చేయడానికి కచ్చితంగా క్లెన్సింగ్ చేయాలి. ఇది చర్మంపై ఉండే నూనె, ధూళి వంటి మలినాలను శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్కిన్ బ్రేక్ అవుట్, క్లోజ్డ్ పోర్స్‌ని తగ్గిస్తుంది. జెల్ క్లెన్సర్లు మంచివే అయినా చర్మాన్ని బాగా డ్రై చేస్తాయి. కాబట్టి మీ స్కిన్‌కి తగిన క్లెన్సర్‌ని, సల్ఫేట్ లేని వాటిని గ్లిజరిన్, హైలూరోనిక్ యాసిడ్ ఉండే ప్రొడెక్ట్స్ ఎంచుకుంటే మంచిది. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి.. స్క్రబ్ అప్లై చేసి.. సున్నింతంగా ముఖాన్ని క్లీన్ చేయాలి. అనంతరం టవర్‌తో రుద్దడం కాకుండా.. డాబ్ చేస్తూ ఆరబెట్టుకోవాలి.
మాయిశ్చరైజర్
ఫేస్ ఆరబెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కచ్చితంగా అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ ఎక్కువసేపు ఫ్రెష్‌గా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా మేకప్‌ను స్కిన్‌తో బ్లెండ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. షైన్ ఇస్తుంది. కాబట్టి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ని ఎంచుకుంటే మంచిది. హైలురోనిక్ యాసిడ్, సిరమైడ్ లేదా గ్లిజరిన్ ఉన్నవి ఎంచుకోవచ్చు. ఇవి మాయిశ్చరైజర్‌ని చర్మంలోకి లాగి.. స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి. మేకప్ కూడా బాగా అప్లై అవ్వడంలో హెల్ప్ చేస్తాయి.
స్కిన్ ప్రైమర్
రేడియంట్ లుక్‌కోసం స్కిన్ ప్రైమర్ అప్లై చేయాలి. గ్లో ఇచ్చే లేదా బ్రైటెనింగ్ ప్రైమర్స్ వాడితే మంచిది. నియాసినమైడ్, విటమిన్ సి ఉండే ప్రైమర్స్ స్కిన్‌కి ఈవెన్ టోన్ అందిస్తాయి. మాయిశ్చరైజర్‌తో తర్వాత దీనిని సన్నని లేయర్‌గా వేయాలి. బుగ్గలు, నుదురు, ముక్కుపై దీనిని అప్లై చేసుకుంటే మంచిది.
సన్‌స్క్రీన్
వృద్ధాప్యఛాయలను రాకూడదన్నా.. స్కిన్ హెల్తీగా ఉండాలన్నా.. సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా అవసరం. మీ మేకప్‌కి ముందు కచ్చితంగా దీనిని అప్లై చేసుకోవాలి. ఇది హైడ్రేటింగ్ని అందించి.. స్కిన్‌ని మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఈ ఉండేది ఎంచుకుంటే మరీ మంచిది. మాయిశ్చరైజర్, ప్రైమర్ తర్వాత దీనిని అప్లై చేయాలి.
ఫేస్ ఆయిల్
మీ ముఖానికి ఇంకా గ్లో కావాలనుకుంటే ఫేస్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. రొటీన్‌గా కంటే మీరు డ్రైగా ఉన్నట్లు ఫీల్ అయితే హైడ్రేషన్ కోసం మీరు ఫేస్ ఆయిల్ ఉపయోగించవచ్చు. గడ్డం, నుదురు, చెంపలపై దీనిని అప్లై చేయవచ్చు. రోజ్‌షిప్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ బెస్ట్ ఫలితాలు ఇస్తాయి.
ఇలా మేకప్‌కి ముందు మీ చర్మాన్ని సిద్ధం చేసుకోవాలి. వీటితో కచ్చితంగా మెరిసే, మృదువైన స్కిన్ మీ సొంతమవుతుంది. అలాగే సాయంత్రం పడుకునేముందు కచ్చితంగా ఫేస్‌పై ఎలాంటి పొడెక్ట్స్ ఉండకుండా క్లీన్ చేసుకుని.. నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే మంచిది.
Also Read : ఈ ఫేస్ మాస్క్‌లతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.. ఇంట్లో ట్రై చేసేయండిలా






















