అన్వేషించండి

Adani Group: అసోం కోసం ట్రెజరీ ఓపెన్‌ చేసిన అదానీ - ఒకేసారి రూ.50,000 కోట్ల పంపింగ్‌ ప్లాన్

Assam Advantage 2.0: అసోంలో జరిగిన 'అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025'లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు.

Adani Group Investment in Assam: గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అసోం కోసం ఏకంగా రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇది, ఆ రాష్ట్రంలో ఒక బిజినెస్‌ గ్రూప్‌ పెట్టిన అత్యంత విలువైన పెట్టుబడుల్లో ఒకటి కావడం విశేషం. రెండు రోజుల బిజినెస్‌ సమ్మిట్‌  'అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025' ‍‌(Advantage Assam 2.0 Investment & Infrastructure Summit 2025) మంగళవారం అసోంలోని గువాహతిలో ప్రారంభమైంది. సదస్సులో ప్రసంగించిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆ రాష్ట్రంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించారు.

"ఇది కేవలం పెట్టుబడి కాదు, అసోం బంగారు భవిష్యత్తుకు పునాది వేయడానికి మేం తీసుకున్న ఒక సంకల్పం. ఈ అభివృద్ధి ప్రయాణంలో మేము భాగం కావడం గర్వంగా ఉంది. అసోం అభివృద్ధి వైపు గొప్పగా అడుగులు వేస్తోంది. అసోంతో కలిసి అదానీ గ్రూప్‌ కూడా ఆ మార్గంలో నడవడం గౌరవంగా భావిస్తున్నాం. ఇది మా నిబద్ధత, ఇది మా దార్శనికత, ఇది మేము ఈ రోజు అస్సాంకు చేస్తున్న వాగ్దానం. భవిష్యత్తును మనం కలిసి నిర్మిద్దాం". - గౌతమ్ అదానీ

వివిధ రంగాల అభివృద్ధి కోసం రూ.50,000 కోట్లు
అదానీ గ్రూప్‌, ఈ 50,000 కోట్ల రూపాయల మెగా పెట్టుబడిని వివిధ రంగాల్లోకి చొప్పిస్తుంది. అసోంలో విమానాశ్రయాలు, ఏరో సిటీ, సిటీ గ్యాస్ పంపిణీ, ప్రసారాలు, సిమెంట్, రహదారి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తుంది. పెట్టుబడిని మించి ఫలితాలు ఇచ్చేలా & అసోం ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా ఇది ఒక మాస్టర్ ప్లాన్‌ అవుతుందని గౌతమ్‌ అదానీ చెప్పారు.

అసోం యువతకు సువర్ణావకాశం
అదానీ గ్రూప్ చేసిన ఈ పెట్టుబడి అసోంలో వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని & మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే, ఇప్పుడు అసోం యువత ఉపాధిని వెతుక్కుంటూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, సొంత ప్రాంతంలోనే పని దొరుకుతుంది. 

గుజరాత్ నుంచి ప్రేరణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెట్టుబడి విధానాన్ని గౌతమ్ అదానీ ప్రశంశించారు. "2003లో గుజరాత్‌లో ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ మొత్తం దేశానికి పెట్టుబడి-ఆధారిత అభివృద్ధి శక్తిని అనుభవంలోకి తీసుకొచ్చింది. నేడు అసోం కూడా అదే దారిలో పయనిస్తోంది" అని చెప్పారు. ఇంకా, "బ్రహ్మపుత్ర నది తన సొంత మార్గాన్ని సృష్టించుకున్నట్లే, ప్రధాన మంత్రి మోదీ భారతదేశంలో ఆర్థిక అవకాశాల కొత్త మార్గాన్ని తెరిచారు" అని అదానీ అన్నారు.

'అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025'లో మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి గ్లోబల్ పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, వివిధ పరిశ్రమల్లోని ప్రముఖ బిజినెస్‌ లీడర్లు కూడా హాజరయ్యారు. అసోం మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, సాంకేతికతల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఆ రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం 'అడ్వాంటేజ్ అసోం 2.0' లక్ష్యం.

'బ్యాంబూ ఆర్కిడ్స్‌' డిజైన్‌ ఆవిష్కరించిన ప్రధాని
అడ్వాంటేజ్ అసోం 2025 సమ్మిట్‌లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గువాహతిలోని 'లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం' (LGBIA) కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం (NITB) 'బ్యాంబూ ఆర్కిడ్స్‌' డిజైన్‌ను ఆవిష్కరించారు. అసోం సహజ సౌందర్యాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించిన ఈ డిజైన్ జీవ వైవిధ్యం, బలం, స్థిరత్వాన్ని సూచిస్తుంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న NITB, ఏడాదికి 13.1 మిలియన్ల ప్రయాణీకుల రద్దీని నిర్వహించగలదు. ఇది, ఈశాన్య ప్రాంతంలో, ఈ కేటగిరీలో మొట్టమొదటి విమానాశ్రయ టెర్మినల్‌గా నిలిచింది. ఇది 2025 చివరి త్రైమాసికం నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

మరో ఆసక్తికర కథనం: మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవా, ట్రేడింగ్‌ జరుగుతుందా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
SRH VS DC IPL 2025:  స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ల
 స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ల
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
IPL 2025 SRH vs DC: 5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
Embed widget