IPL 2025 SRH Horrible Show: పవర్ ప్లేలో సన్ హారీబుల్ షో.. 37-4తో వీక్ స్టార్ట్... అనికేత్ ఫిఫ్టీ.. క్లాసెన్ తో కీలక భాగస్వామ్యం
విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ లోనూ సన్ తడబడింది. పవర్ ప్లేలో అల్లాడిస్తారనుకున్న ఆరెంజీ ఆర్బీ బ్యాటర్లు.. అభిమానులకే రివర్స్ షాకిచ్చాడు. 25 బంతులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది.

IPL 2025 DC VS SRH Live Updates: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడి కాస్త పుంజుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ కు ఒకదశలో హారీబుల్ స్టార్ట్ ఎదురైంది. 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ (1) రనౌట్ తో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత కొనసాగించింది.
వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ (2), తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (0) సింగిల్ డిజిట్ కే అవటవగా.. శుభారంభం లభించిన ట్రావిస్ హెడ్ (22) కూడా ఔటవడంతో 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. పేసర్ మిషెల్ స్టార్క్ మూడు వికెట్లతో సన్ ను వణికించాడు. అయితే మధ్యలో అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (32) ఆదుకోవడంతో పంద పరుగుల మార్కును సన్ దాటింది. వీరిద్దరూ 77 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
What a Star(c)t for #DC 💙#SRH are 29/3 after 3 overs.
— IndianPremierLeague (@IPL) March 30, 2025
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH | @DelhiCapitals pic.twitter.com/ROJpaaLhXT
ఆదుకున్న అనికేత్..
ఈ సీజన్ తోనే అరంగేట్రం చేసినా అనికేత్ వర్మ మెచ్యూర్ గా ఆడాడు. ముఖ్యంగా నాలుగు వికెట్లు పడిన దశలో అనికేత్.. ఆరంభంలోనే ఎదురుదాడికి బౌలింగ్ ను కాస్త కంగారు పెట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ, అనికేత్ మాత్రం తనదైన స్టైల్లో ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడటంతో సన్ కోలుకుంది. మరో ఎండ్ లో హెన్రిచ్ క్లాసెన్ కూడా సత్తా చాటడంతో ఐదో వికెట్ కు మంచి భాగస్వామ్యం నమోదైంది. 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించడంతో సన్ పుంజుకుంది.
🆒 Under Pressure 🧊
— IndianPremierLeague (@IPL) March 30, 2025
Aniket Verma is dealing in just sixes and is closing on his half-century 💪
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH | @SunRisers pic.twitter.com/8KYjx2O14x
మళ్లీ విఫలమైన అభినవ్ మనోహర్..
ఈ సీజన్ లో మూడో మ్యాచ్ ఆడుతున్న అభినవ్ మనోహర్ (4) మరోసారి విఫలమయ్యాడు. రాజస్థాన్ పై డకౌట్, లక్నో సూపర్ జెయింట్స్ పై రెండు పరుగులు చేసిన అభినవ్ ఈ మ్యాచ్ లో నాలుగు పరుగులతో ఉస్సూరమునిపించాడు. మిడిలార్డర్లో ఆడుతున్న అభినవ్.. వరుసగా అవకాశాలు లభిస్తున్నా వినియోగించుకోవడం లేదు. తన ఔటయ్యే సమయానికి ఇంకా ఎనిమిది ఓవర్లు ఉన్నప్పటికీ, భారీ షాట్ వికెట్ పారేసుకున్నాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆఖర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ (2) కూడా చెత్త షాట్ ఔటయ్యాడు. దీంతో 128 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది. మరోవైపు అనికేత్ 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తను మాత్రం ఫిఫ్టీ తర్వాత కూడా రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటికే ఐదేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు బాదాడు. గత మ్యాచ్ లోనూ రాణించాడు.




















