CBSE Draft Scheme: ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల 'ముసాయిదా' రెడీ - అభిప్రాయాలు తెలిపేందుకు ఛాన్స్
CBSE: సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేందుకు సంబంధించిన ముసాయిదాను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కోరుతోంది.

CBSE Draft Scheme for Class X Examinations: సీబీఎస్‌ఈ పరీక్షలో విధానంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ తరహాలో 2026 నుంచి విద్యార్థులకు రెండు సార్లు సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా(Draft Scheme)ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. దీనిప్రకారం ఫిబ్రవరి - మార్చిలో మొదటి విడత పరీక్షలు; మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతోపాటు ముసాయిదా డేట్ షీట్స్‌ను సైతం ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన ఫిబ్రవరి 25 జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. విస్తృతమైన చర్చల అనంతరం రూపొందించిన ముసాయిదాను వెబ్‌సైట్‌లో చూడవచ్చని కేంద్ర మంత్రి సూచించారు.
పరీక్షలు ఎప్పుడంటే?
ఈ ముసాయిదా ప్రకారం.. 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలూ పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ముసాయిదాలో స్పష్టం చేసింది. మరోవైపు, బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించినా.. ప్రాక్టికల్స్/ అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒకేసారి చేయనున్నట్లు పేర్కొంది. ఈ తరహా విధానం విద్యార్థులు తమ పెర్ఫామెన్స్‌ను మరింతగా మెరుగుపరుచుకొనే అవకాశం కల్పిస్తుందని తెలిపింది.
ఫీడ్ బ్యాక్ తెలిపేందుకు మార్చి 9 వరకు అవకాశం..
ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా స్పందించవచ్చని బోర్డు సూచించింది. తమకు వచ్చిన స్పందనలను పరిశీలించిన తర్వాత ఈ ముసాయిదాను సమీక్షించి, సవరించి తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు.
రెండింటిలో ఉత్తమ స్కోర్ పరిగణనలోకి..
ఈ విధానంతో విద్యార్థులు రెండుసార్లు పరీక్ష రాయడం ద్వారా అధిక మార్కులు పొందే అవకాశం విద్యార్థులకు కలగనుంది. రెండింటితో ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ఫలితాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. కేవలం పరీక్ష ద్వారా మార్కుల సాధించడమే కాదు నైపుణ్యం , సెల్ఫ్ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టడం ద్వారా జాతీయ విద్యావిధానం లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు. అదనంగా 2026-27 విద్యాసంవత్సరంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్లు, భారత దేశ ముఖ్యమైన అంశాలను ఈ సెలబస్‌లో చేర్చడం వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.
ముసాయిదా పాలసీ కోసం క్లిక్ చేయండి..
ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

