అన్వేషించండి

Kannappa Song: తేలిక పదాలతో బరువైన శివతత్వాన్ని చూపించిన రామజోగయ్య శాస్త్రి... 'శివా శివా శంకరా' సాంగ్ అందుకే సూపర్ హిట్!

Shiva Shiva Shankara Song: సోషల్ మీడియాలో కన్నప్ప సాంగ్ మోత మోగిపోతోంది. ఈపాటకున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంతలా భక్తులకు కనెక్ట్ అయిందో తెలుసా..

Kannappa Shiva Shiva Shankara Song:  మంచు విష్ణు 'కన్నప్ప' మూవీపై మొన్నటివరకూ వచ్చిన ట్రోల్స్ కి చెక్ పెట్టేసింది శివా శివా శంకరా సాంగ్.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట పాడింది విజయ్ ప్రకాష్. 

ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ కన్నప్ప భక్తి పాటకి.. క్రిస్టియన్ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.

ఈ పాటలో లిరిక్స్ మాత్రమే కాదు..పిక్చరైజేషన్ కూడా అద్భుతం అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. 

అప్పటి భక్త కన్నప్ప సినిమాలో... శివ శివ శంకర పాట ఎన్నోసార్లు విని ఉంటారు..చూసి ఉంటారు. ఆ పాటలో శివుడిపై నీళ్లు చిలకరించడం, అలంకారం చేయడం,  మాంసం నైవేద్యం పెట్టడం చూశారు..  

మరి ఈ కన్నప్ప పాటలో కొత్తగా ఏం చూపించారు? అంతలా ఎందుకు కనెక్ట్ అయింది?

అన్నం ముద్దలో శివలింగం కనిపిస్తుంది

దారిలో కనిపించే కొమ్మలు త్రిశూలంలా కనిపిస్తాయి

చెట్టు కొడుతుంటే శివలింగంలా కనిపిస్తుంది

అర్థరాత్రి నిద్రలేచి చూస్తే ..శివుడిని చూసి కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా అంటాడు..

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

అసలు ఈ పాట ప్రారంభమే...తెలివికన్ను తెరుసుకుందయ్యా అని ప్రారంభమవుతుంది... అంటే..
మంత్రం, యంత్రం, తంత్రం, పూజ , పునస్కారం ఇవేమీ తెలియని భక్తుడు కన్నప్ప. ఓ కన్ను తీసి పెట్టిన కన్నప్ప కాలివేలు గుర్తుగా పెట్టుకుంటాడు.  రెండో కన్ను తీసే సమయంలో శివుడిని ఓ ప్రశ్న వేశాడు. రెండు కళ్లు అంటే ఇచ్చేశాను కానీ మరి నీకు మూడోకన్ను ఉంది కదా అదెలా అనుకున్నాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించాడు. ఆ మూడో నేత్రమే తెలివికన్ను. ఈ పదం వినియోగించడం వెనుకున్న ఆంతర్యం ఇదే.  

మనసు నిన్ను తెలుసుకుందయ్యా 
విశ్వమంతా నువ్వే అని తెలుసుకున్నా అని అర్థం. మబ్బుల్లో గీతలు నీ నామాలు, కొమ్మలు త్రిశూలం, భోజనం శివలింగంగా కనిపించడం ఇలా  ఎటు చూసినా శివుడే కనిపిస్తున్నాడని చెప్పడం. ప్రకృతి మొత్తం శివమయం అని చెప్పడమే ఈ పాట ఉద్దేశం.

Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!

ఈ పాట ఇప్పటివరకూ మీరు వినకపోయినా..చూడకపోయినా...ఇదిగో ఇక్కడుంది..

కన్నప్ప..శివా శివా శంకరా సాంగ్ లిరిక్స్

తెలివి కన్ను తెరుసుకుందయ్యా..శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా..మాయ గంతలు తీయ్యా

తెలివి కన్ను తెరుసుకుందయ్యా..శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా..మాయ గంతలు తీయ్యా

మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు
నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి
నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి
ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా

శివ శివ శంకర..సాంబ శివ శంకర
హరోం హర హరహర..నీలకంధరా

స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన
లింగమయ్య నీవే నాకు తోచినావుగా
దారెంట … కొమ్మలు శివ శూలాలే
మబ్బుల్లో… గీతలు నీ నామాలే

లోకమంతా నాకు శివమయమే
యాడ చూడు నీ అనుభవమే
ఓంకారము పలికినవి పిల్ల గాలులే…

ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా
నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా
శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా….

శివ శివ శంకర..సాంబ శివ శంకర
హరోం హర హరహర..నీలకంధరా

ఓ.. కొండ వాగు నీళ్లు నీకు లాలపోయానా..
అడివి మల్లె పూలదండ అలంకరించనా
నా ఇంటి… చంటి బిడ్డవు నువ్వు
ముపొద్దు… నీతో నవ్వుల కొలువు

దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా
ఓ శివయ్య .. ఇప్ప తేనే ఉంది విందు చేయనా
నిన్ను సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా…  

ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో
చలి మంచుకు విల విల ఏ పాటు పడితివో
ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా….

కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య
ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా
ఏమైనా… నీకు న్యాయంగుందా
ఈ పైనా.. నిన్ను వదిలేదుందా

ఎట్టగట్టనో తల తిరిగి..మొగసిన తపమంతా కరిగి
శివయ్య నీ సిగముడిలో సింకుకుంటిరా…

పొమ్మని ఇదిలించినా.. కసురుతూ కరిగించినా
శులముతో పొడిచినా.. పాములు కరిపించినా
నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా…

శివ శివ శంకర..సాంబ శివ శంకర
హరోం హర హరహర..నీలకంధర

హరహర హరహర హరహర హరహర హరనే శివనే
హర హర శంకర..శివా శివా శంకర
శంకర శంకర శివా శివా శంకర

హర హర శంకర..శివా శివా శంకర
శంకర శంకర శివా శివా శంకర

హర హర శంకర..శివా శివా శంకర
శంకర శంకర శివా శివా శంకర
శంకర… శివా శంకర..శివా…. శివా….

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Embed widget