SLBC Tunnel: SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
SLBC Tunnel: SLBC టన్నెల్‌లో కీలకంగా మారిన ఆ 50 మీటర్లు. అటువైపు 8 మంది కార్మికులు , ఇటువైపు వందలాదిగా ఆర్మీ, నేవీ రెస్కూ సిబ్బంది. బురదనీటితో నిండిన భాగం దాటి వెళ్తేనే ప్రాణాలు దక్కేది.

SLBC Tunnel Latest News: శ్రీశైలం SLBC టన్నెల్‌లో గత నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లోనే 8 మంది కార్మికులు మృత్యువుతో పోరాడుతున్నారు. వారిని రక్షించడం ఇప్పుడు ప్రభుత్వానికి అతి పెద్ద టాస్క్‌గా మారింది. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, నేవీ, హైడ్రా సిబ్బంది గత నాలుగు రోజులుగా, నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వారిని క్షేమంగా బయటకు తీసుకువస్తారో తెలియని అయోమయం నెలకొంది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించడం కష్టంగా మారడానికి ప్రధాన కారణం ప్రమాద ప్రాంతం వద్ద జరిగిన విధ్వంసం. టన్నెల్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఉన్నది ఒకే ఒక మార్గం. ఇంత సంక్లిష్టంగా ఉన్న మార్గంలో కూడా కొంతమేర లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ ప్రయత్నాలు కొంతమేరకు ఫలించినా ఆ 50 మీటర్ల దూరం ఇప్పుడు రెస్కూటీమ్‌లకు పెనుసవాలుగా మారింది.
టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు, ప్రాణాలతో బయటపడ్డ 52 మంది కార్మికులు చెబుతున్నది ఒక్కటే. ప్రమాద సమయంలో ఒక్కసారిగా ఏదో కూలిపడినట్లు భారీ శబ్ధం వినిపించింది. తామున్న ప్రాంతానికి 40మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పరుగులు పెడుతూ, కన్వేయర్ బెల్టు సహాయంతో బయటకు వచ్చేశామని చెబుతున్నారు. టన్నెల పైభాగం కూలిన టైంలో అవతలి వైపున ఉన్న 8 మంది తప్పించుకునే అవకాశంలేక లోపలే చిక్కుకుపోయారు. ఆ రోజు మొదలు నేటికీ నాలుగు రోజుల నుంచి వారు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ టీమ్.
Also Read: రేవంత్ సర్కార్‌ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
టన్నెలో ప్రధాన ముఖద్వారా నుంచి సుమారుగా 14వ కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. నాలుగు రోజులపాటు శ్రమించి ఎట్టకేలకు 12కిలోమీటర్ల మేర టెన్నెల్ లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లగలిగారు రెస్కూ సిబ్బంది. అక్కడి నుంచి మరో కిలోమీటర్‌పైగా బురదలో నడచి చేరుకోగలిగారు. కానీ ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీనికి కారణం టెన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. టిబిఎం శకలాలతో సుమారు 50 మీటర్ల మేర టన్నెల్ నిండిపోయింది. దీనికి తోడు మనిషిని మించిన ఎత్తులో బురద టన్నెల్ మొత్తం పేరుకుపోయింది. ఉబికి వస్తున్న నీటి ఊటతో కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలా అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ 50మీటర్లు దాటి ముందుకు వెళ్లగలిగతేనే అవతలి వైపున ఉన్న ఎనిమిది మంది కార్మికులను రక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు రోజులు దాటిపోయింది. టెన్నెల్లో ఉన్నవారికి కనీసం ఊపిరి అందుతుందో లేదో తెలియని అయోమం నెలకొంది. ఈ పరిస్థితిలో తాత్కాలికంగా బ్లోయర్లు ఏర్పాటు చేసి లోపల ఉన్నవారికి గాలి అందించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోపైపు ఇప్పటికే పాడైన కన్వేయర్ బెల్టును పునరుద్దరించి, బెల్టు సహాయంతో బురదను బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బురద, నీటిని బయటకు తీయడంతోపాటు లోపల ఉన్నవారిని గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రోబో స్కోప్, డ్రోన్ ఎక్యూప్‌మెంట్, స్వీపర్ డాగ్స్‌తోపాటు లోపల ఉన్నవారి పేర్లతో పిలి వారి క్షేమ సమచారం తెలుసుకుంటున్నారు. లోపలికి వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు బయటకు రాగానే వారికి అవసరమైన వైద్యం అందించే చర్యలు తీసుకున్నారు. అత్యవసర వైద్య పరికరాలతో మెడికల్ టీమ్‌లను టెన్నెల్‌కు సమీపంలో అందుబాటులో ఉంచారు.
Also Read: తెలంగాణలో ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి కీలక ప్రకటన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

