Pushpa 2: యూట్యూబ్ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Kissik Song Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా 'పుష్ప 2: ది రూల్'లోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఆ పాటతో పాన్ ఇండియాను షేక్ ఎప్పుడో తెలుసా?
'పుష్ప: ది రైజ్' సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. పాన్ ఇండియాలో ఆ సినిమా భారీ సక్సెస్ సాధించింది. మరి, సీక్వెల్ 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ అంటే ఏ రేంజులో ఉండాలి? ఆ సంగతి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్... ఆ ముగ్గురికి బాగా తెలుసు. అందుకే యూట్యూబ్ షేక్ చేసే పాటతో రెడీ అయ్యారు.
కిస్సిక్... స్పెషల్ సాంగ్ రిలీజ్ ఈ వారమే!
'పార్టీ ఉంది పుష్ప' అంటూ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ 'పుష్ప 2' ట్రైలర్లో చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమం చూస్తే పార్టీ అనే పదానికి ఇంకా పెద్ద మాట వెతకాలి. ఆ స్థాయిలో గ్రాండ్ ఈవెంట్ చేసిన యూనిట్... ఆడియన్స్ అందరికీ మరో పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు 'పుష్ప 2' సినిమాలో స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
#Kissik 📸 song from #Pushpa2TheRule Flashing Worldwide on November 24th from 7:02 PM ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2024
It is time for Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 to set the dance floor on fire 🔥
A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER,… pic.twitter.com/Qi5E7nRO5X
'పుష్ప ది రూల్' సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సాంగ్ షూటింగ్ మొదలు అయ్యిందో లేదో ఎవరో ఫోటోలు తీసి లీక్ చేసేశారు. ఆ తర్వాత యూనిట్ అఫీషియల్ గా స్టిల్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ హీరోలలో డాన్స్ ఎవరు బాగా చేస్తారు అని లిస్టు తీస్తే అల్లు అర్జున్ పేరు కచ్చితంగా టాప్ 3లో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ల లిస్టు తీస్తే శ్రీ లీల పేరు కూడా కచ్చితంగా టాప్ 3లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేసిన స్పెషల్ సాంగ్ కావడంతో టాలీవుడ్ ఆడియన్స్ అందరి చూపు దీని మీద ఉంది.
చెన్నై, కొచ్చి వెళ్లనున్న అల్లు అర్జున్!
పాట్నాలో ట్రైలర్ రిలీజ్ తర్వాత తమిళనాడు, కేరళ టూర్ వెళ్లడానికి అల్లు అర్జున్ రెడీ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈనెల 24వ తేదీన ఒక ఈవెంట్ చేయనున్నారు. అదే విధంగా కొచ్చిలో 27వ తేదీన మరో ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరు మరింత పెంచారు.
పాన్ ఇండియా సినిమా అంటే దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, అల్లు అర్జున్ మరో అడుగు ముందుకు వేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీ, బెంగాలీలో కూడా సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఓ ఈవెంట్ చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ లేదా ఏపీలో ఒక భారీ ఈవెంట్ చేయనున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.