Sri Sri Rajavaru Movie Release: దసరాకు 'శ్రీ శ్రీ రాజావారు' - హ్యాట్రిక్ మీద కన్నేసిన ఎన్టీఆర్ బావమరిది నితిన్
'మ్యాడ్' సినిమాతో హీరోగా పరిచయమైన నార్నే నితిన్, ఇటీవల 'ఆయ్'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ మీద కన్నేశారు. దసరాకు మరో సినిమా తీసుకు వస్తున్నారు.
![Sri Sri Rajavaru Movie Release: దసరాకు 'శ్రీ శ్రీ రాజావారు' - హ్యాట్రిక్ మీద కన్నేసిన ఎన్టీఆర్ బావమరిది నితిన్ Narne Nithin aims for hat-trick with Dussehra 2024 release Sri Sri Rajavaru after the success of Mad and Aay Sri Sri Rajavaru Movie Release: దసరాకు 'శ్రీ శ్రీ రాజావారు' - హ్యాట్రిక్ మీద కన్నేసిన ఎన్టీఆర్ బావమరిది నితిన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/08/13d44dba1e3732b9a39b242addf0c1fe1725788982710313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడిగా నార్నే నితిన్ (Narne Nithin) రాజకీయ, వ్యాపార వర్గాలకు తెలుసు. అయితే... సినీ ప్రేక్షకులకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిదిగా తెలుసు. 'మ్యాడ్'తో హీరోగా పరిచయం అయిన నార్నే నితిన్, మొదటి సినిమాతో విజయం అందుకున్నారు. ఇటీవల 'ఆయ్'తో తన ఖాతాలో మరో విజయం వేసుకున్నారు. దసరాకు హ్యాట్రిక్ అందుకోవాలని రెడీ అవుతున్నారు.
విజయ దశమికి నార్నే నితిన్ 'శ్రీ శ్రీ రాజావారు'
నార్నే నితిన్ కథానాయకుడిగా నటించిన మూడో సినిమా 'శ్రీ శ్రీ రాజావారు' (Sri Sri Rajavaru Movie). ఆయన సరసన సంపద కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న 'శతమానం భవతి' సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ప్రొడ్యూస్ చేశారు.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, అనంత్ అంబానీ ABP Desam#anantambani #salmankhan #salmankhanfans #salmankhanlovers #ambani #ganeshchaturthi #ganeshchaturthi2024 #ganeshfestival #ganesh #ganeshpooja pic.twitter.com/0ZUAQ4GfLR
— ABP Desam (@ABPDesam) September 8, 2024
విజయ దశమి కానుకగా అక్టోబర్‌లో 'శ్రీ శ్రీ రాజావారు'ను అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో అన్ని వాణిజ్య హంగులతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మా హీరో నార్నే నితిన్ గారు 'మ్యాడ్', 'ఆయ్'తో మంచి విజయాలు అందుకున్నారు. మా 'శ్రీ శ్రీ రాజావారు'తో తప్పకుండా హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు. వైవిధ్యంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. వాణిజ్య హంగులు, భారీ తారాగణంతో దర్శకుడు సతీష్ వేగేశ్న అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ స్వయంగా ఈ కథ ఓకే చేశారు. ఆయనకు బాగా నచ్చింది'' అని చెప్పారు. దసరాకు థియేటర్లలో సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు. ఈ సినిమాతో పాటు దసరాకు మరో నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి.
Also Read: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!
Sri Sri Sri Raja Vaaru Movie Cast And Crew: నార్నే నితిన్, సంపద జంటగా నటిస్తున్న 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' సినిమాలో రావు రమేష్, నరేష్ వీకే, రఘు కుంచె, ప్రవీణ్, 'రచ్చ' రవి, సరయు, రమ్య, ప్రియా మాచిరాజు, భద్రం, ఆనంద్, 'జబర్దస్త్' నాగి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, ఛాయాగ్రహణం: దాము నర్రావుల, కూర్పు: మధు, పాటలు: శ్రీమణి, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర - మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సీహెచ్‌వీ శర్మ - రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు - ఎం సుబ్బారెడ్డి, రచన - దర్శకత్వం: సతీష్ వేగేశ్న.
Also Read: వారసురాలు వచ్చింది... పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన దీపికా పదుకోన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)