Deepika Ranveer Baby: వారసురాలు వచ్చింది... పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన దీపికా పదుకోన్
Deepika Padukone Ranveer Singh Baby: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ తల్లిదతండ్రులు అయ్యారు. ఈ రోజు దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మ ఇచ్చారు.
దీపికా పదుకోన్ అభిమానులకు గుడ్ న్యూస్. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపిక ఇంట వారసురాలు అడుగు పెట్టింది. ఈ రోజు పండంటి ఆడబిడ్డకు స్టార్ హీరోయిన్ జన్మ ఇచ్చారు. ఆమె రాకతో పదుకోన్ - రణ్‌వీర్ కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిశాయి.
దీపిక వారసురాలు జన్మించింది ఏ ఆస్పత్రిలో!?
ముంబైలోని ఫేమస్ హెచ్.ఎన్. రిలయన్స్ ఆస్పత్రిలో దీపికా పదుకోన్ డెలివరీ జరిగింది. ఈ వినాయక చవితి రోజు ఆవిడ ఆస్పత్రిలో చేరారు. కుమార్తె దీపికకు తోడుగా తల్లి ఉజ్జల పదుకోన్ సైతం ఆస్పత్రికి నిన్న చేరుకున్నారు. తొలుత ఈ నెలాఖరున డెలివరి అయ్యే అవకాశాలు ఉన్నాయని ముంబై వర్గాల్లో వినిపించినా... ఈ రోజు గుడ్ న్యూస్ వచ్చింది.
View this post on Instagram
గణేష్ చతుర్థికి కారులో కనిపించలేదు కానీ...
అమ్మాయి జన్మించడానికి ముందు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు ముంబైలోని శ్రీ సిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నారు. గణేష్ చతుర్థికి ఒక్క రోజు ముందు ఆ గణేశుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయంలో దీప్ వీర్ జోడీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టాయి. అయితే... ఆ తర్వాత గణేష్ చతుర్థి నాడు ఆస్పత్రిలో చేరడానికి వెళ్లిన సమయంలో దీపికా పదుకోన్ అసలు కనిపించలేదు. రిలయన్స్ ఆస్పత్రిలోకి దీపికా పదుకోన్ కారు వెళ్లిన వీడియో మీడియా కంట పడింది. దీపిక దృశ్యాలు మాత్రం చిక్కలేదు.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
వైరల్ అయిన దీప్ వీర్ జంట మెటర్నిటీ ఫోటోషూట్!
దీపికా పదుకోన్ ఈ నెలలో బిడ్డకు జన్మ ఇస్తారని అటు పరిశ్రమ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు... అందరూ నిర్ణయానికి రావడానికి కారణం మెటర్నిటీ ఫోటోషూట్. ఈ నెల ప్రారంభంలో... సెప్టెంబర్ 2వ తేదీన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో దీపిక బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది.
Also Read: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!
ప్రస్తుతం దీపికా పదుకోన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... 'సింగం ఎగైన్'లో లేడీ పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టి పాత్రలో మరోసారి సందడి చేయనున్నారు. అందులో ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ సైతం నటిస్తున్నారు. డెలివరీకి ముందు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో గర్భవతి పాత్రలో దీపికా పదుకోన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 1440 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. రణ్‌వీర్ సింగ్ విషయానికి వస్తే... ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ టాక్.