అన్వేషించండి

Sathyam Sundaram Release Date: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'

Devara Vs Sathyam Sundaram: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' థియేటర్లలోకి వస్తున్న రోజే... కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన 'సత్యం సుందరం' విడుదల కానుంది.

సెప్టెంబర్ 27 అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుకు వచ్చేది ఒక్కటే... 'దేవర'. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ఆ రోజున మరో సినిమా కూడా రానుంది. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన తమిళ కథానాయకుడు కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం సుందరం' వస్తోంది. 

సెప్టెంబర్ 27న 'సత్యం సుందరం' విడుదల
కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సత్యం సుందరం'. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... కార్తీక్ సోదరుడు, తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు సూర్య, జ్యోతిక దంపతులు తమ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తీకి సొంత సినిమా లెక్క. అరవింద్ స్వామి మరో మెయిన్ లీడ్ చేసిన సత్యం సుందరం సినిమాపై తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి. అయితే... తెలుగులో ఈ సినిమాకు గట్టి పోటీ ఉందని చెప్పాలి.

తెలుగులో 'దేవర' ముంగిట కార్తీ సినిమా!
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించడమే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం మెట్టించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో 'దేవర' మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో పాటు తమిళ,  మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమా పబ్లిసిటీ ఓ స్థాయిలో జరుగుతోంది. మూడు పాటలు విడుదల చేశారు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఏడు లక్షల డాలర్లకు పైగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సైతం 'దేవర' భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులలో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి పబ్లిసిటీ స్టార్ట్ చేయని కార్తీ అరవింద్ స్వామిల సినిమా 'సత్యం సుందరం'. 'దేవర' ముందు నిలబడుతుందా? లేదా? అనేది చూడాలి. ఎన్టీఆర్ సినిమాను కాదని ఎంతమంది కార్తి సినిమాకు వెళతారని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

తెలుగులో సత్యం సుందరం సినిమాను ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. సో... థియేటర్లకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు.‌ దేవర టికెట్స్ దొరకని ప్రేక్షకులు సత్యం సుందరం సినిమాకు వచ్చే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. దేవర తో పాటు రిలీజ్ చేయడం వెనక అది ఓ‌ స్ట్రాటజీ అనుకోవచ్చు.

Also Readఆస్పత్రిలో జాయిన్ అయిన దీపికా పదుకోన్ - ఏ క్షణమైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్


తమిళనాడులో 'దేవర'కు కాస్త ఎఫెక్ట్?
'ఆర్ఆర్ఆర్' సినిమాతో తమిళ ప్రేక్షకులకు సైతం ఎన్టీఆర్ చేరువ  అయ్యారు. అయితే... కార్తీ - అరవింద్ స్వామి నటించిన సినిమా కావడం, పైగా సూర్య - జ్యోతిక దంపతులు నిర్మించడంతో అక్కడ 'సత్యం సుందరం' సినిమాకు మొదటి రోజు ప్రేక్షకులు వెళ్లే అవకాశం ఎక్కువ. దేవర మీద ఓపెనింగ్స్ వరకు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.‌ కంటెంట్ ఈజ్ కింగ్ కనుక బావున్నా సినిమాకు ప్రేక్షకులు తర్వాత అయినా సరే వస్తారు.

Also Readనయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget