తొమ్మిది సినిమాలు చేసినా భారీ హిట్ కూడా కొట్టని స్టార్ కిడ్... హీరోయిన్‌తో ఎఫైర్ రూమర్స్, ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేదుగా
తొమ్మిది సినిమాలు చేసినా ఒక్క సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కొట్టని స్టార్ కిడ్ ఇతను. ఓ హీరోయిన్‌తో ఎఫైర్ అని రూమర్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ అతని చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అతనెవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలి అంటే బ్యాగ్రౌండ్ మాత్రమే కాదు, కూసింత లక్కు కూడా ఉండాలి. లేదంటే స్టార్ కిడ్ అయినా, ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకోవడం కష్టమే. టాలీవుడ్లో కూడా ఓ స్టార్ కిడ్ కు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. భారీ సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సదరు హీరో. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్, మేనమామ సూపర్ స్టార్, అన్నయ్య మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో... అయినప్పటికీ ఈ హీరోకి ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాలేదు. తొమ్మిది సినిమాలు చేసినా, ఒక్క భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కూడా తన ఖాతాలో పడకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. మధ్యలో హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తున్నాడు అంటూ పలు పుకార్లు కూడా వినిపించాయి. ఈ తెలుగు హీరో మరెవరో కాదు అల్లు శిరీష్.
అల్లు వారసుడిగా ఎంట్రీ
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలుగా ఉన్నారు. వాళ్లలో అల్లు వారసుడిగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే. అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుని, ఆ తర్వాత తన టాలెంట్ తో సొంత కాళ్ళపై నిలబడి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నారు. అయితే అల్లు శిరీష్ విషయంలో మాత్రం ఇదంతా పూర్తిగా ఆపోజిట్లో జరిగింది. 'గౌరవం' మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు అల్లు శిరీష్. కానీ మొదటి సినిమానే సక్సెస్ కాకపోవడంతో ఆయనకు నిరాశ ఎదురయింది. ఇక ఆ తర్వాత వరుసగా తొమ్మిది సినిమాల్లో నటించాడు అల్లు శిరీష్.
ఆ లిస్టులో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, 1971 : బియాండ్ బోర్డర్స్ అనే మలయాళం మూవీ, ఒక్క క్షణం, ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో, బడ్డి వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు. ఇందులో 'శ్రీరస్తు శుభమస్తు' మూవీకి మంచి టాక్ వచ్చింది. 2019లో వచ్చిన 'ఏబిసిడి' మూవీ అట్టర్ ప్లాఫ్ కావడంతో లాంగ్ గ్యాప్ తీసుకుని, 'ఊర్వశివో రాక్షశివో' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా అల్లు శిరీష్ కెరీర్‌ని నిలబెట్టలేకపోయింది. చివరగా అల్లు శిరీష్ 2024లో రిలీజ్ అయిన 'బడ్డీ' అనే మూవీలో కనిపించాడు. ఈ మూవీ కూడా అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో, ఎప్పుడు పోయిందో ప్రేక్షకులకు తెలియలేదు.
హీరోయిన్ తో ప్రేమాయణం అని పుకార్లు
అందరు హీరోల విషయంలో జరిగినట్టే, అల్లు శిరీష్ కూడా ప్రేమలో ఉన్నాడంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. 'నా పేరు సూర్య', 'శైలజ రెడ్డి అల్లుడు', 'మజ్ను', 'మహాసముద్రం' అంటే సినిమాల్లో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ ప్రేమలో మునిగిపోయారంటూ కొన్ని రోజులు టాక్ నడిచింది. 'ఊర్వశివో రాక్షశివో' మూవీ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ఈ జంట త్వరగానే పెళ్లి చేసుకోబోతోందని అన్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం సినీ తారలపై ఇలాంటి రూమర్స్ రావడం సహజమే అంటూ కూల్ గా కొట్టి పారేశాడు. పైగా 'మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే' అని తేల్చి చెప్పాడు అల్లు శిరీష్.
Also Read: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

