News
News
X

AP Tenth Exams : ఏపీ టెన్త్‌లో ఇక ఆరు పేపర్లే - సీబీఎస్‌ఈ పరీక్షా విధానం అమలుకు ఉత్తర్వులు !

ఏపీ టెన్త్ పరీక్షల్లో ఇక ఆరు పేపర్లే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నారు.

FOLLOW US: 

AP Tenth Exams :   పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్నందున 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు పెడతారు కానీ.. నేరుగా సీబీఎస్‌ఈకి సబంధం ఉండదని.. రాష్ట్ర బోర్డే పెడుతుందని భావిస్తున్నారు. 

విద్యార్థులకు మంచి భవిష్యత్ కోసం సీబీఎస్‌ఈ విధానం 

పదో తరగతి.. భవిష్యత్తు అవకాశాలకు అత్యంత కీలకమైన దశ! ఉన్నత విద్యలో ఏ కోర్సులో అడుగు పెట్టాలనే స్పష్టతకు సాధనం.. పదో తరగతి మార్కులు!! అంతేకాదు ఈ తరగతిలో చూపిన ప్రతిభ, వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అందుకే కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.   వాస్తవానికి పదో తరగతి పరీక్షల్లో హిందీ మినహా మిగతా సబ్జెక్ట్‌లలో (తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌) ..ప్రతి సబ్జెక్ట్‌లోనూ పేపర్‌–1,పేపర్‌–2 ఉంటాయి. అలా మొత్తం పదకొండు పేపర్లలో పరీక్షలు జరిగేవి. కానీ.. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో గత పరీక్షలను ఏడు పేపర్లతోనే నిర్వహించారు.   

భారమైన 'దూరవిద్య' - అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు డబుల్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటుతారన్న ఏపీ ప్రభుత్వం

సీబీఎస్‌ఈ సిలబస్‌తో పది, ఇంటర్‌ పూర్తి చేస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తాచాటే అవకాశం దక్కుతుంది. ఈ విధానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండగా... ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలుచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సిలబస్‌ వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆరో తరగతి నుంచే జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థి అభ్యసనా సామ ర్థ్యాలు పెంచేలా సిలబస్‌ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, కంప్యూటర్, సైన్స్‌ ల్యాబ్‌లు, ఆటస్థలం ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన సిలబస్‌లో ఇమిడి ఉంటుంది. ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి కేంద్రీకృత సంస్థ నుంచి భవిష్యత్‌ అధ్యయనాలను కొనసాగించాలను కుంటే సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు చాలా సహాయ పడతాయి. ఈ సంస్థల ప్రాథమిక పరీక్షలు సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు. అందుకే సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

Read Also: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌

Published at : 22 Aug 2022 06:31 PM (IST) Tags: ap tenth exams AP Tenth

సంబంధిత కథనాలు

JVVD Application: జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

JVVD Application: జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!