AP EAMCET Counselling Dates 2022: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
మొదట ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 22 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET -2022) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొదట ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 22 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.
ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 2,82,496 మంది హాజరుకాగా.., 2,56,983 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 89.12 శాతం అర్హత సాధించారు. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్షకు హాజరుకాగా.. 83,411 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 95.06 శాతం అర్హత సాధించారు.
AP EAPCET - 2022 Rank Cards
ఇంజినీరింగ్ విభాగంలో 2,06,579 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,94,752 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,73,572 మంది క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1.48 లక్షల సీట్లను భర్తీచేస్తారు.
ఏపీ ఈఏపీసెట్ షెడ్యూలు ఇలా..
✈ ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: ఆగస్టు 22 నుంచి ఆగస్టు 30 వరకు
✈ సర్టిఫికెట్ల పరిశీలన: ఆగస్టు 23 - 31
✈ కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 వరకు
✈ వెబ్ ఆప్షన్లలో మార్పు: సెప్టెంబరు 3న
✈ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 6న
✈ కాలేజీల్లో రిపోర్టింగ్: సెప్టెంబరు 6 - 12
✈ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి
Read Also: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ స్కాలర్‌షిప్
తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు ఇలా..
తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలు ఆగస్టు 12న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూలును కూడా అధికారులు ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ సాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 17న తుది విడత సీట్ల కేటాయింపుతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది.
తెలంగా ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
☛ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
☛ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
☛ ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
☛ సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
☛ సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
☛ సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
☛ సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
☛ అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
☛ అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
☛ అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభమైంది. ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..