News
News
X

Tirupati News : ప్రేమ వివాహంపై ఫైన్, కట్టలేదని యువతిపై గ్రామపెద్దల దాడి!

Tirupati News : కులాంతర, ప్రేమ వివాహం చేసుకుంటే ఆ గ్రామ పెద్దలు జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించకపోతే గ్రామ బహిష్కరణ చేస్తారు. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతిపై గ్రామస్తులు దాడిచేశారు.

FOLLOW US: 

Tirupati News : ప్రేమ వివాహం ఆ యువతికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మగారింటికి వచ్చిన ఆ యువతి పట్ల ఆ ఊరి గ్రామస్తులు కర్కశంగా ప్రవర్తించారు. గ్రామ కట్టుబాటు ప్రకారం గ్రామస్తులు విధించిన జరిమానాను ఇచ్చిన గడువులోపు చెల్లించాలని లేదంటే ఆ గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని బహిష్కరిస్తామని గ్రామ పెద్దలు చెప్పారు. ప్రేమ వివాహం‌ చేసుకుని ఎనిమిది నెలల‌ తరువాత అమ్మగారింటికి వచ్చిన యువతికి యాభై వేల రూపాయలు జరిమానా విధించారు గ్రామస్తులు. కొంత సమయం అడిగినందుకు మహిళ అనే గౌరవం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ దారుణ ఘటన తిరుపతి‌ జిల్లా ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది. 

అసలేం జరిగింది? 

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాత వీరాపురం గ్రామానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ ఊరి పెద్దలు జరిమానా విధించారు. పాత వీరాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన లీలావతి అనే యువతి 8 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియుడిని వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తవారింటిలోనే ఉన్న లీలావతి, వివాహం తర్వాత మొదటి సారి పుట్టింటికి వాళ్ల పిలుపుతో వీరాపురం గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ‌ నెల 14వ తేదీన స్వగ్రామానికి వచ్చిన లీలావతిని గంటల వ్యవధిలోనే ఆ గ్రామపెద్దలు నిలదీశారు. గ్రామ కట్టుబాటు ప్రకారం ప్రేమ వివాహం, కులంతర వివాహం చేసుకున్నవారికి జరిమానా విధించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని లీలావతి భర్త శ్రీహరిని గ్రామ కట్టుబాట్లు తెలియజేశారు. 

జరిమానా చెల్లించలేదని దాడి 

News Reels

తమ గ్రామం కట్టుబాటును అతిక్రమించి ప్రేమ వివాహం చేసుకున్న లీలావతికి 50 వేల రూపాయలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. కొంత సమయం కావాలని లీలావతి కుటుంబ సభ్యులు గ్రామస్తులను వేడుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు గడువు ఇచ్చారు. అయితే నగదు సమయానికి దొరక్కపోవడంతో మరికొద్ది రోజులు గడువు అడిగారు. దీంతో లీలావతిపై గ్రామస్తులు విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో‌ పడి ఉన్న లీలావతిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు లీలావతి ఫిర్యాదుతో గ్రామానికి చెందిన మురగయ్య, వాణి, సునీల్, అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. లీలావతిని గ్రామస్తులు తీవ్రంగా గాయపరచడంతో గర్భస్రవం అయ్యిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

దాడిపై కేసు నమోదు 

"పాత వీరాపురం గ్రామంలో లీలావతి యువతి ఎనిమిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ఎస్సీ కమ్యూనిటీకి చెందినంది. ఆ గ్రామ కట్టుబాట్లు ప్రకారం ఎవరైనా కులాంతర, ప్రేమ వివాహం చేసుకుంటే ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం రూ.25 వేలు కట్టాలి. లేదంటే ఎస్సీ కాలనీలో గుడి బాగుచేయాలి. లేదంటే గ్రామంలోని ఎస్సీలందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. ఇలా కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ విషయంపై గ్రామ పెద్దలు ప్రశ్నించారు. కొందరు యువతిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రూయా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేశాం"- పోలీసులు   

Published at : 17 Oct 2022 06:48 PM (IST) Tags: Tirupati News AP Crime Village elders love marriage fine

సంబంధిత కథనాలు

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి

Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!