Nita Ambani Emotional Kanyadaan Speech : కన్యాదానం, ఆడపిల్లపై నీతా అంబానీ ఎమోషనల్ స్పీచ్- ప్రతి ఒక్కరూ వినాల్సిన కామెంట్స్
Anant Ambani Radhika Merchant Wedding: ఆడపిల్లలు అంటే ఇంట్లో ఐశ్వర్య వెలుగులంటూ నీతా అంబానీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. కన్యాదానంపై కూడా అంతే ఎమెషనల్ కామెంట్స్ చేశారు.
Nita Ambani Poetic explanation Of Kanyadaan: కన్యాదానంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబాని చేసిన ప్రసంగం మంత్రముగ్దులను చేస్తోంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ రిసెప్షన్ సయమంలో ఆమె కన్యాదానం ప్రాసస్త్యాన్ని వివరించారు. దేశ సంప్రదాయల్లోనే అత్యంత విలువైన ప్రక్రియ కన్యాదానంగా నీతా అంబాని అభివర్ణించారు. అయితే తమ కుమార్తెను వేరే ఇంటికి పంపించడానికి ఏ కన్నవారికి కూడా మనసు రాదని అన్నారు.
ఎవరూ వదులుకోరు
ఏళ్ల తరబడి తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం, ఆప్యాయత, ఆనందం, మధుర జ్ఞాపకాల నుంచి ఒక కుమార్తె ఎలా దూరం కాగలదూ? అవి ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. వాటిని ఎవరూ వేరే వాళ్లకు ఇవ్వలేం. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డను వేరే వాళ్లకు అప్పగించాలని అనుకోరు. అసలు అలా ఇచ్చేయడానికి అదేమీ ఆస్తి కాదు. ఎప్పుడూ నిధిలా మనతో ఉంచుకొని ఆశీర్వాదం. అయితే ఆమె పంచే ప్రేమ, ఆప్యాయత, ఆనందం వేరే ఇంటి వెలుగుకు కారణం అవ్వాలని పంపిస్తారు. అప్పటి వరకు తన కుటుంబంతో పంచుకున్న వాటిన్నింటినీ కొత్త కుటుంబంతో పంచుకుంటుంది."అని నీతా అంబానీ అన్నారు.
కన్యాదానంపై నీతా అంబానీ చేసిన కామెంట్స్ అక్కడి వారి కళ్లు చెమర్చాయి. వచ్చిన అతిథులంతా ఎమోషనల్ అయ్యారు.
ఆడపిల్ల ఉన్న చోటే ఐశ్వర్యం
"భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మహిళను ఉన్నత స్థానంలో ఉంచాయి. ఆడపిల్లలు ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుందని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఆడపిల్లలకు దేవుడు ఎక్కువ శక్తిని ఇచ్చాడు. వాళ్లు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు." అని ఆమె అన్నారు.
వధూవరుల మధ్య, వారి ఫ్యామీల మధ్య ఉండే సమానత్వం వివాహ బంధం పునాదిపై ఆధారపడి ఉంటుంది. భారతీయ వివాహం వరుడు మరియు వధువు మధ్య మరియు వారి నిజమైన కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వం యొక్క పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కన్యాదానానికి అసలైన అర్థం ఏంటంటే.. వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించడంతోపాటు తమ కుమార్తెను వరుడి ఫ్యామిలీకి అప్పగించడం" అని చెప్పుకొచ్చారు.
స్వచ్ఛమైన మసులు వాళ్లవి
"ఓ ఆడపిల్లగా, తల్లిగా, అత్తగా నాకు తెలిసి ఏ కుమార్తెను కూడా తమ తల్లిదండ్రులు వేరే ఇంటికి ఇచ్చేందుకు ఇష్టపడరు. అని ఆమె చెప్పారు.
కుమార్తె జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం, గొప్ప ఆనందం. వారు లక్ష్మీ స్వరూపులు. వారు పుట్టినప్పటి నుంచి ఇంటిని ఐశ్వర్యంతో నింపేస్తారు. మన ఉనికి గుర్తు చేసే స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్లే ఆడపిల్లలు. అని నీతా అంబానీ వివరించారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ జూలై 12న జరిగింది. దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన అప్పగింతల వేడుక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగానే నీతు అంబానీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
Also Read: మా అత్త వల్లే పెళ్లి ఇంత ఘనంగా జరిగింది, నీతా అంబానీని పొగడ్తలతో ముంచెత్తిన రాధిక
Also Read: కొడుకు పెళ్లి కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు