Amadalavalasa Politics: ఓడినా మారని నేతల తీరు, వైసీపీ క్యాడర్‌లో అయోమయం! ఆమదాలవలసలో ఏం జరుగుతోంది ?
Srikakulam Politics : సిక్కోలలో ఒకే నియోజకవర్గంలో వైయస్సార్సీపీకి పార్టీకి ఐదుగురు అభ్యర్థులు, ఐదు ఆఫీసులతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

Andhra Pradesh News | ఆమదాలవలస నియోజకవర్గంలో నాటి కాంగ్రెస్ నుండి మొన్నటి వైసీపీ వరకు.. నాకు టిక్కెట్ కావాలే! నాకు టికెట్ కావాలే గోల అనాదిగా వస్తున్నదే! అప్పట్లో ప్రతిఘటన సినిమాలో కోట ఒక డైలాగ్ అన్నారు... హైదరాబాద్ టికెట్ కొనలేనోళ్ళందరు నాకు టికెట్ కావాలి. అన్నోళ్ళే. రేపు ఎన్నికలొస్తే డబ్బులు ఖర్చు పెట్టగలమా! లేదా! అనే ఆలోచన పక్కన పెట్టి వైఎస్ జగన్ బొమ్మెట్టి గెలిచేస్తాం. గెలిస్తే. వాడి మీద, ఈడి మీద గెలిచాం. మినిస్ట్రీ ఇస్తారా అడుగుతారు.
ఇప్పుడు అధికారం పోయింది కార్యకర్తలను ఆదుకోవాలి, పార్టీ గడ్డు పరిస్థితిలో ఉంది. రాబోయే ఎన్నికలలో ఎలా గెలుస్తాం అనే సమన్వయ ఆలోచనైతే ఈ ఆమదాలవలస నేతలకు లేదు. తాజాగా కుమారుడికి ఎలాగైనా రాబోయే ఎన్నికలులో టికెట్ ఇప్పించి తన వారసత్వ రాజకీయానికి పునాది వేయాలనే ఆలోచన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంది. తనయుడు చిరంజీవి నాగ్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఐతే గతంలో అసమ్మతి నేతగా ఉన్న చింతాడ రవి కుమార్ అనే టెక్కలి ఐతం కాలేజ్ ప్రొఫెసర్ని మాజీ సిఎం జగన్ ఇంఛార్జ్ చేశారు. ఇక సీతారాంని పార్లమెంటుకు పంపే ఉద్దేశంతో శ్రీకాకుళం ఇంఛార్జ్‌ను చేశారు. ఇక్కడ ఆట మొదలు పెట్టారు సీతారాం. రాష్ట్ర కార్యదర్శి పదవితో సరుబుజ్జిలి ఎంపీపీ కిల్లి గోపాల వెంకటసత్యనారాయణను ఆమదాలవలసలో పార్టీ ఆఫీస్ తెరిపించి, అసమ్మతికి బీజం వేశారు.
కలివరం పంచాయతీ సర్పంచ్ గా కొర్లకోట సనపల లక్షన్నాయుడు.. టీడీపీ లీడర్ అల్లుడు తమ్మయ్యపేట గ్రామం కోట గోవింద రావు కూడా మెయిన్ రోడ్డులో వైసిపి ఆఫీసు జిల్లా వైసిపి అధికారప్రతినిధి హోదాలో ఏర్పాటు చేసి కుమారుడుతో సజ్జల, విజయసాయి. జగన్ ని అడపా దడపా కలుస్తూ నేను రెడీ అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మాదిరిగా కాంగ్రెస్ ను వీడి ఆ కుటుంబంతో విభేదించి ఆగర్భ రాజకీయ శత్రువైన తమ్మినేనికి మున్సిపల్లో వెన్ను దన్నుగా నిలిచిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ కూడా ఇంచార్జ్ పదవి ఆశించి తాను కూడా ఎన్నికలకు సై అంటున్నారు.
అసమ్మతి వాదులుగా ముద్రపడి..
గత ఎన్నికలలో పార్టీని వీడి స్వత్రంత్ర అభ్యర్థిగా 10 వేల ఓట్లు పొందిన సువ్వారి గాంధీ మళ్లీ వైసీపీలోకి కిల్లి జోక్యంతో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కిల్లి ఒక్క సరుబుజ్జిలికి ఆమదాలవలస మునిసిపల్లో మాత్రమే ప్రభావం చూపిస్తారు. చింతాడ మునిసిపల్ బూర్జ సరుబుజ్జిలిలో ప్రభావం చూపిస్తారు. ఇక తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో తనకంటూ ఒక వర్గం అభిమానులు ఐతే ఉన్నారు. కుమారుడు చిరంజీవి అందరితో తండ్రి మార్క్ తో వెళుతున్నా.. ఈయనపై కూడా ఆ ప్రచారం ఉంది. అధిష్టానం మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ పార్లమెంట్ స్థానంలో తమ్మినేని ద్వారా కింజరాపు కోట గోడలు బద్దలు కొట్టించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కులం కార్డుతో దువ్వాడ, పేరాడలతో భంగ పడ్డా ఎలాగైనా సీతారాంతో ఆ కోరిక నెరవేర్చు కోవాలనే సంకల్పంతో వైసీపీ ఉంది.
అసెంబ్లీ సీటుపై ఉన్న ఇష్టం పార్లమెంట్ స్థానంపై లేదు. అధిష్టానం కాదు అంటే కొడుకుకి అసెంబ్లీ సీటు, తాను ఎంపీగా పోటీ చేసే ప్రతి పాదన సిద్ధం చేస్తున్నారు. అధిష్టానం కాదు అంటే కిల్లి పేరు అసెంబ్లీకి సిఫార్సు చేసేలా పావులు కదుపు తున్నారు. టీడీపీ ఇక్కడ బలంగా వున్న జెన్కో పవర్ ప్లాంట్ నెత్తిన పెట్టుకుని వివాదాలను కొని తెచ్చుకోవటం వైసిపికి లాభం చేకూర్చింది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే ఒంటరిగా పోరాటం చేస్తూ ముందుకు పోయే కూన వైసిపికి పని కల్పించారు. ఇటీవల వైసిపి సానుభూతి పరులు జొన్నవలస, నెల్లిపర్తి గ్రామస్తుల ఇళ్ల కూల్చివేతను వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ అసమ్మతితో పంచ పాండవు లోయుద్ధం మొదలయ్యింది అనే పరిస్థితి కనిపిస్తోంది. 33వేల భారీ మెజారిటీతో ఓడిపోయినా ఈ అసమ్మతి కుంపటి ఏంటో అర్ధం కావటం లేదు అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

