Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP Desam
మీరు చూస్తున్నది రైలు బస్సు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా లేని అరుదైన " రైలు బస్సు" నిన్న మొన్నటి వరకూ ఏపీలో తిరిగేది. అయితే కరోనా పేరు చెప్పి దానిని రద్దు చేసింది రైల్వే డిపార్ట్మెంట్. దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృషితో రైల్వే లైన్ ఏర్పాటైనా రైలు తిరగని... కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ ఆ ట్రాక్ ను వినియోగించుకుంటూ ఈ రైలు బస్సు తిరిగేది. 8 స్టేషన్ లో ఆగుతూ కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45కిలోమీటర్లు ప్రయాణించేది ఈ రైలు బస్సు. దీనికి టికెట్లు రైలు బస్సు లోపలే ఇచ్చేవారు. దీన్ని నడిపే డ్రైవరే టికెట్లు ఇచ్చుకోవాలి. అలాగే తనే దిగి వెళ్లి రైలు గేటు వేసుకుని రైలు బస్సు ముందుకు వెళ్లిన తర్వాత వెనక్కి వచ్చి గేటు తెరవాలి. అప్పట్లో కాకినాడ నుంచి కోటిపల్లికి బస్సు చార్జి 30 రూపాయలైతే రైలు బస్సు ఛార్జీ పదిరూపాయలే. కరోనా కారణంగా రద్దు అయిపోయిన ఇలాంటి రైలు బస్సు మోడలే..ప్రస్తుతం మైసూర్ రైల్వే మ్యూజియంలో రైలు బస్ మోడల్ భద్రపరిచి ఉంచారు. అదెలా ఉంటుందో చూద్దామా..